హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నాడు. మూడో టీ20 కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'క్రికెట్‌కు ఓకే.. డ్రగ్స్‌కు నో' అనే నినాదంతో కేరళ పోలీసులు సోమవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కోహ్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
వేలాది మంది పాఠశాల పిల్లలను ఉద్దేశించి విరాట్ కోహ్లీ మాట్లాడాడు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపినిచ్చాడు. కేరళలోని చంద్రశేఖరన్ నాయర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం పినరయి విజయన్, డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా, కోహ్లీతో పాటు దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ పాల్గొన్నారు.

క్రికెట్‌కు ఓకే.. డ్రగ్స్‌కు నో టైటిల్‌తో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం గులాబి రంగు బెలూన్లను గాల్లోకి ఎగరేసి మద్దతు తెలిపాడు. ఇదిలా ఉంటే భారత్-న్యూజిలాండ్ సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో టీ20 మంగళవారం తిరువనంతపురంలో జరగనుంది.
మూడు రోజులుగా అక్కడ వర్షాలు కురుస్తుండటంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేశారు. దీంతో సోమవారం రెండు జట్లు ప్రాక్టీస్ రద్దు చేసుకున్నాయి. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.