హైదరాబాద్: విదేశాల్లో టెస్టు సిరిస్‌లు గెలిచే సత్తా ప్రస్తుత విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఉందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. 2000-2004 మధ్య కాలంలో విదేశాల్లో మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నేతత్వంలోని టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
సరిగ్గా అలాంటి పేస్ ఎటాక్ బౌలింగ్ ప్రస్తుత కోహ్లీ సేనలో ఉన్నాయని సెహ్వాగ్ అన్నాడు. కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు స్వదేశంలో అద్భుతంగా రాణిస్తుందని పేర్కొన్నాడు. అంతక ముందు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లలో 3-0తో వైట్ వాష్ చేసిన సందర్భాన్ని గుర్తు చేశాడు.

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఉపఖండం వెలుపల జరిగే టెస్టు సిరిస్‌లలో కూడా కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా విజయం సాధిస్తుందని సెహ్వాగ్ తెలిపాడు.
గతంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో గెలుపొందిన గంగూలీ జట్టు ప్రదర్శనను కోహ్లీ సేన తప్పక పునరావృతం చేస్తుందనే విశ్వాసం తనకు ఉందని సెహ్వాగ్ చెప్పాడు. 'కోహ్లీ కెప్టెన్‌గా సామర్థ్యం ఉన్న బ్యాటింగ్‌ను మనం చూశాం. వికెట్లు పడగొట్టాలంటే మంచి బౌలింగ్ అవసరం. జట్టులో షమీ రూపంలో తెలివిన బౌలర్ ఉన్నాడు. భారత్‌ను గెలిపించగల ఉమేశ్ యాదవ్, ఇషాంత్‌శర్మలు జట్టులో ఉన్నారు' అని సెహ్వాగ్ తెలిపాడు.

విదేశాల్లో కూడా స్వదేశంలో మాదిరి అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేస్తారనడంలో ఎటువంటి సందేహామే లేదని అన్నాడు. ఇక రంజీల్లో అత్యుత్తమ ప్రదర్శన కబనర్చిన రిషబ్ పంత్‌పై సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇండియాకు అతడు తప్పక ప్రాతినిధ్యం వహిస్తాడని చెప్పాడు.