
అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో మూడో వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ కావడన్ని పలువురు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్‌తో వైరల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఇక జట్టు నుంచి తప్పుకోని విశ్రాంతి తీసుకోవాలని రాసుకొస్తున్నారు. తద్వారా బెంచ్‌లో ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ ఆఫ్రీదీ డకౌట్ల అకాడమీ పేరుతో ఒక మీమ్ క్రియేట్ చేశారు. అందులోకి డకౌట్ అయిన విరాట్ కోహ్లీని బహుమతితో ఆఫ్రీదీ ఆహ్వానిస్తున్నట్లు క్రియేట్ చేసిన ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ''ఆఫ్రీదీ డకౌట్స్ అకాడమీలోకి విరాట్ కోహ్లీకి స్వాగతం. ఇక కోహ్లీ మరింత అభివృద్ధి చెందాని కోరుకుంటున్నాం.'' అని ఆఫ్రీదీ ఆహ్వానిస్తున్నట్లు రాసుకొచ్చారు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్రీదీ అనేక మార్లు డకౌట్ అయ్యాడు.
అలాగే కోహ్లీ 71వ సెంచరీ కోసం చాలా రోజులుగా ఎదురుచూసి అలసిపోయిన అభిమానులు విరాట్‌కు సెంచరీ చేయడానికి ఆసక్తి లేదని రాసుకొస్తున్నారు. అలాగే కోహ్లీని సిరాజ్ ఓదారుస్తున్నట్లు క్రియేట్ చేసిన మీమ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లీ నుంచి చాలా కాలంగా పెద్ద స్కోర్ ఆశిస్తున్నామని కానీ ఈ గోల్డెన్ డకౌట్‌తో ఇక ఓపిక పోయిందని పలువురు చెబుతున్నారు. అయితే అదే సమయంలో పలువురు అభిమానులు ట్విట్టర్‌లో కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోహ్లీ తిరిగి తన పాత ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నారు.
కాగా వెస్టిండీస్‌తో మూడో వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో స్టంప్స్ వైపు బంతిని ఆడబోయే వికెట్ కీపర్ షాయ్ హోప్‌కు దొరికిపోయాడు. కాగా ఈ సిరీస్‌లో విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి వన్డేలో 8, సెకండ్ వన్డేలో 18, థర్డ్ వన్డేలో డకౌట్ అయ్యాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 26 పరుగులే చేశాడు. దీంతో ఈ సిరీస్‌లో కోహ్లీ అత్యల్ప స్కోర్ నమోదు చేశాడు. అలాగే చివరి 5 వన్డేల్లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. ఇక 2019 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ మళ్లీ సెంచరీ కొట్టలేదు.