మీడియా సమావేశం: ధోనీ భవిష్యత్తుపై ప్రశ్న.. నవ్వేసిన కోహ్లీ!!

IND vs SA 3rd Test : Kohli Laughed When Asked About Dhoni's Future || Oneindia Telugu

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్‌ భవిష్యత్తు గురించి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్‌ గంగూలీ ఏమైనా మాట్లాడాడా అని ఓ ప్రశ్న అడగ్గా.. కోహ్లీ నవ్వేసాడు.

<strong>బంగ్లా ఆటగాళ్లు భారత సిరీస్‌కు వస్తారు.. కోహ్లీ ఆడుతాడా లేదో అడుగుతా: గంగూలీ</strong>బంగ్లా ఆటగాళ్లు భారత సిరీస్‌కు వస్తారు.. కోహ్లీ ఆడుతాడా లేదో అడుగుతా: గంగూలీ

ధోనీ గురించి ఏమీ మాట్లాడలేదు:

ధోనీ రిటైర్మెంట్ గురించి సెలెక్టర్లతో మాట్లాడుతా. ఆపై ధోనీతో కూడా చర్చిస్తా అని గంగూలీ ఇటీవలే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు విరాట్ కోహ్లీకి ప్రశ్న ఎదురైంది. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ... 'ధోనీ భవిష్యత్తు గురించి గంగూలీ నాతో ఏమీ మాట్లాడలేదు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు గంగూలీకి అభినందనలు. గంగూలీ అధ్యక్షుడుగా రావడం గొప్పగా ఉంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నాతో టచ్‌లో ఉంటాడు. అయితే ఇప్పటివరకూ ధోనీ గురించి కానీ జట్టు గురించి కానీ గంగూలీ నాతో ఏమీ మాట్లాడలేదు' అని స్పష్టం చేసాడు.

ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడు

ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడు

తొలిసారి గంగూలీతో ఏం మాట్లాడుతారో అని అడగ్గా.. 'అక్టోబర్‌ 24న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంగూలీని కలుస్తా. బీసీసీఐ ప్రెసిడెంట్‌తో ఒక కెప్టెన్‌గా ఏం మాట్లాడాలో అప్పుడే మాట్లాడతా' అని అన్నాడు. రాంచీ మ్యాచ్‌ ముగిసింది, ధోనీ ఇంటికి వెళతారా అని ప్రశ్నించగా.. 'ఈ రోజు ఆటలో ధోనీనే ఇక్కడకు వచ్చి ఆటగాళ్లను కలిసాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడు. రండి హలో చెప్పండి' అని తనదైన స్టయిల్లో సమాధానం ఇచ్చాడు.

బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మా సొంతం:

బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మా సొంతం:

'ఈ సిరీస్‌ చాలా గొప్పగా సాగింది. సిరీస్‌ విజయం సమిష్టిగా సాధించాం. భారత జట్టు లాంటి బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఏ జట్టులోనూ లేదు. స్పిన్‌ బౌలింగ్‌ ఎప్పటికీ మా బలం. బ్యాటింగ్‌ కూడా. ఇక పేస్‌ బౌలర్లు కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. షమీ, ఉమేష్‌, ఇషాంత్‌ ఈ సిరీస్‌లో బాగా రాణించారు. బ్యాటింగ్‌లో రోహిత్‌ ఓపెనర్‌గా విజయవంతమవడం అదనపు బలం. మయాంక్‌కు అతను సరైన జోడీ. రహానే సైతం ఫామ్‌లో ఉన్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో జడేజా, అశ్విన్‌, సాహాల బ్యాటింగ్ బాగుంది. ఫీల్డింగ్‌లో సైతం టీమిండియా ప్రమాణాలు మెరుగుపడ్డాయి' అని కోహ్లీ తెలిపాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, October 22, 2019, 14:32 [IST]
Other articles published on Oct 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X