నాథన్‌ను కట్టడి చేయకపోతే మరింత ప్రమాదకారి అవుతాడు: కోహ్లీ

మెల్‌బోర్న్: మరి కొద్ది గంటల్లో మొదలుకానున్న ఆసీస్-భారత్ మూడో టెస్టుకు భారీ ఎత్తున్న అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ పూర్తి చేసుకుని ఆడేందుకు సిద్ధమైపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల మేనేజ్‌మెంట్ తమ పదకొండు మంది సభ్యులతో తుది జట్టును ప్రకటించేశాయి. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొని తమ జట్టును ఉద్దేశించి మాట్లాడాడు. వ్యక్తిగత స్కోరుకు ప్రాధాన్యం ఇవ్వకుండా జట్టుగా ఆసీస్ జట్టుపై విరుచుకుపడాలని పిలుపునిచ్చాడు.

లయన్‌ని సమర్థంగా ఎదుర్కోవాలంటూ
ఇంకా బుధవారం నుంచి జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్‌ని సమర్థంగా ఎదుర్కోవాలంటూ సూచించాడు. పెర్త్ వేదికగా గత వారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ టాపార్డర్‌ని ఉక్కిరిబిక్కిరి చేసిన నాథన్ లయన్.. 8 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా.. ఈ టెస్టు సిరీస్‌లోనూ ఏకంగా 16 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా లయన్ కొనసాగుతున్నాడు. దీంతో నాథన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

తగ్గట్టుగానే ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమైయ్యాం
మూడో టెస్టులోనూ లయన్‌తో భారత్‌కి చిక్కులు తప్పవేమోననే సందేహాలు విరాట్ కోహ్లీ నివృతి చేసేలా స్పందించాడు. ‘నాథన్ లయన్ చాలా నైపుణ్యమున్న బౌలర్. టెస్టు సిరీస్‌లో అతను తెలివిగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. అతణ్ని కచ్చితంగా చేధించాలి. లేదంటే మరింత ప్రమాదకరంగా మారిపోతాడు. దానికి తగ్గట్టుగానే ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమైయ్యాం. ఏదైనా సిరీస్‌లో ప్రత్యర్థి బౌలర్ నిలకడగా రాణిస్తుంటే.. కచ్చితంగా అతడ్ని నిలువరించేందుకు వ్యూహాలు రచించాల్సిందే' అంటూ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

ఫలితం 1-1తో సమమవగా
అడిలైడ్ టెస్టులో 31 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. పెర్త్ టెస్టులో 146 పరుగుల తేడాతో పరాజయానికి గురైంది. దీంతో.. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఫలితం 1-1తో సమమవగా.. మళ్లీ పుంజుకోవాలనే క్రమంలో ఇరు జట్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications