Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రొమాంటిక్' డ్యాన్స్: విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ బ్రోమాన్స్ (వీడియో)

IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే కేవలం టీమిండియా విజయాన్ని మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులకు వినోదాన్ని కూడా పంచింది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఆనందంలో విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ మైదానంలో చేసిన సరదా డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

విరాట్, కుల్దీప్ బ్రోమాన్స్
వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో భారత్ అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో రాణించగా.. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 4 కీలక వికెట్లు పడగొట్టి విజయాన్ని సులభతరం చేశారు. కింగ్ కోహ్లీ స్టేడియంలో తన దూకుడు ప్రవర్తనకు ప్రసిద్ధి చెందారు. మూడో వన్డే సందర్భంగా కుల్దీప్ యాదవ్ అద్భుతమైన డెలివరీతో కార్బిన్ బాష్ వికెట్‌ను తీయగానే.. విరాట్ కోహ్లీ ఉప్పొంగిన ఆనందంతో కుల్దీప్ వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ చేతిని పట్టుకుని అతడిని ఓ చిన్న 'రొమాంటిక్ డ్యాన్స్' తరహాలో కదిలించాడు.

Virat Kohli Kuldeep Yadav Romantic Dance Celebration Goes Viral

వికెట్ పడిన ఆనందంలో సీరియస్‌గా ఉన్న కుల్దీప్‌ను విరాట్ కోహ్లీ ఒక్కసారిగా సరదాగా డ్యాన్స్ చేయించడం అక్కడున్న ఆటగాళ్లందరితో పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు యువ ఆటగాళ్లతో ఎంత స్నేహపూర్వకంగా ఉంటున్నారో ఈ 'బ్రోమాన్స్' దృశ్యం స్పష్టం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

కుల్దీప్ యాదవ్ చారిత్రక రికార్డు
వికెట్ తీసిన తర్వాత విరాట్ కోహ్లీతో సరదాగా డ్యాన్స్ చేసిన కుల్దీప్ యాదవ్, ఈ మ్యాచ్‌లో ఒక చారిత్రక రికార్డును కూడా నెలకొల్పాడు. 10 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం ద్వారా కుల్దీప్ ఈ ఘనత సాధించాడు.

ఒకే జట్టుపై అత్యధిక '4 వికెట్ల హాల్స్' (భారత బౌలర్లు): భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వన్డే ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా జట్టుపై ఐదో సారి '4 వికెట్ల హాల్' సాధించాడు. వన్డేల్లో ఏదైనా ఒక జట్టుపై భారతీయ బౌలర్ సాధించిన అత్యధిక '4 వికెట్ల హాల్స్' రికార్డు ఇదే. గతంలో జహీర్ ఖాన్ జింబాబ్వేపై, మహ్మద్ షమీ వెస్టిండీస్‌పై నాలుగు సార్లు ఈ ఘనత సాధించారు. వారి రికార్డులను కుల్దీప్ బద్దలు కొట్టాడు.

ఓవరాల్ '4 వికెట్ల హాల్స్':
ఈ ప్రదర్శనతో కుల్దీప్ తన కెరీర్‌లో మొత్తం 11 సార్లు '4 వికెట్ల హాల్' సాధించి, వన్డే ఫార్మాట్‌లో అత్యధికంగా ఈ ఘనత సాధించిన మూడో భారతీయ బౌలర్‌గా నిలిచాడు. మహ్మద్ షమీ (16 సార్లు), అజిత్ అగార్కర్ (12 సార్లు) మాత్రమే ఈ జాబితాలో కుల్దీప్ కంటే ముందున్నారు.

Story first published: Sunday, December 7, 2025, 12:42 [IST]
Other articles published on Dec 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+