న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధైర్యంగా యుద్ధం చేద్దాం.. దేశ ప్రజలకు విరాట్ కోహ్లీ సందేశం!!

Virat Kohli, KL Rahul Message On Coronavirus Pandemic

ముంబై: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌ 19 (కరోనా) వైరస్‌పై భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మొట్టమొదటిసారి పెదవి విప్పాడు. కరోనా పట్ల మనమంతా ధైర్యంగా ఉండి పోరాడదామని కోహ్లీ అన్నాడు. ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించాడు. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో.. తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని దేశ ప్రజలను కోరాడు. వైరస్ బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమ మార్గమని కోహ్లీ పేర్కొన్నాడు.

<strong>సంజయ్‌ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్.. కామెంట్రీ ప్యానెల్‌ నుంచి ఔట్?!!</strong>సంజయ్‌ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్.. కామెంట్రీ ప్యానెల్‌ నుంచి ఔట్?!!

ధైర్యంగా యుద్ధం చేద్దాం:

'ప్రజలందరూ కరోనా వైరస్‌పై పోరాడేందుకు దృఢచిత్తంతో ముందుకు కదలండి. కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడదాం. అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోండి. ముఖ్యంగా వైరస్ బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమ మార్గం' అని శనివారం ట్విటర్‌ వేదికగా కోహ్లీ సూచించాడు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు క్రీడల పోటీలను వాయిదా వేసిన నేపథ్యంలో కోహ్లీ దేశ ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెప్పాడు. కోహ్లీ శుక్రవారం విమానాశ్రమంలో మాస్క్ వేసుకుని కనిపించాడు.

సూచనలను పాటిస్తూ.. సురక్షితంగా ఉండండి:

'ఈ కఠిన సమయంలో అందరం దైర్యంగా ఉండి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుందాం. ఆరోగ్య నిపుణులు ఇచ్చిన సూచనలను పాటిస్తూ.. సురక్షితంగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా' అని లోకేష్ రాహుల్ ట్వీట్ చేసాడు. దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శుక్రవారం బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను రద్దు చేయగా.. అంతకుముందే ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది. దీంతో కోహ్లీసేనకు అనుకోని విశ్రాంతి లభించింది.

భారత్‌లో 82 కరోనా కేసులు:

భారత్‌లో 82 కరోనా కేసులు:

శుక్రవారం న్యూజిలాండ్‌ పేసర్‌ లాకీ ఫెర్గూసన్‌ తీవ్ర గొంతునొప్పికి గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన ఆ జట్టు వెంటనే అతడిని ప్రత్యేక వార్డుకు చేర్చింది. ఆసీస్‌ పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ సైతం గొంతు నొప్పితో బాధపడ్డాడు. ఇక ఇప్పటివరకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 82కు చేరాయి. కాగా ఇద్దరు మృతిచెందారు. ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాల్లో 1,45,631 మందికి కరోనాతో బాధపడుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Story first published: Saturday, March 14, 2020, 13:55 [IST]
Other articles published on Mar 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X