విరాట్ కోహ్లీని 'ఛేజ్ మాస్టర్' అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు అర్ధమైందా?

హైదరాబాద్: విరాట్ కోహ్లీ ఓ గేమ్ ఛేంజర్, ఛేజ్ మాస్టర్, కింగ్ కోహ్లీ. ఇవన్నీ కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేర్లు. బరిలోకి దిగాడంటే చాలు పరుగుల వరద పారిస్తాడు. అంతేకాదు ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ని ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు అనేకం. ముఖ్యంగా ఛేజింగ్‌లో కోహ్లీ ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై విరుచుకుపడతాడు.

ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ ఇలా
గత కొన్నేళ్లుగా ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌లను గనుక పరిశీలిస్తే కసితో ఆడుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా, బారాబతి స్టేడియంలో ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చూస్తే ఇదే ఆలోచన కలుగుతుంది. వందకు పైగా స్టైక్ రేట్‌తో 85 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

300 పరుగులకు భారీ లక్ష్యాలను
ఈ క్రమంలో టీమిండియా 300 పరుగులకు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సమయంలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 9 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక్కడ కోహ్లీ స్టైక్ రేట్ 107.13 ఉండగా, యావరేజ్ 62. 25గా ఉంది. అంతేకాదు ఛేజింగ్‌లో కోహ్లీ 31 ఇన్నింగ్స్‌లు ఆడి 1,743 పరుగులు సాధించాడు.

కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 183
ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 183. ఆసియాకప్‌లో భాగంగా మిర్పూర్ వేదికగా 2012లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ స్కోరు చేసి టీమిండియాను గెలిపించాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీ అత్యధికవ్యక్తిగత స్కోరు కూడా ఇదే కావడం విశేషం. అయితే, మూడో వన్డేలో కోహ్లీ తృటిలో సెంచరీని మిస్సయ్యాడు.

85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్
జట్టు స్కోరు 286 పరుగుల వద్ద కీమో పాల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ(85; 81 బంతుల్లో 9 ఫోర్లు) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(39), శార్ధుల్ ఠాకూర్(17) ఇద్దరూ దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుని 2019ని విజయంతో ముగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications