వసీం అక్రమ్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కోహ్లీ
కాన్‌బెర్రా: భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. జనవరి 12న పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియాతో జరిగే 5వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు చేస్తానని మాటిచ్చిన కోహ్లీ.. నాలుగో వన్డేలో రెండో సెంచరీ చేసి తన వాగ్ధానాన్ని పూర్తి చేశాడు.
పెర్త్ వన్డేలో సెంచరీ చేజార్చుకున్న కోహ్లీ.. వచ్చే మ్యాచుల్లో రెండు శతకాలు నమోదు చేస్తానని వసీం అక్రమ్‌కు మాటిచ్చాడు. ఈ మేరకు రెండు వరుస శతకాలు చేసి తన మాటను నిలబెట్టుకున్నాడు.

27ఏళ్ల ఈ ఆటగాడు వేగవంతంగా 25 సెంచరీలను నమోదు చేశాడు. కేవలం 162 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. కాగా, 49 సెంచరీలు బాదిన సచిన్ టెండూల్కర్ శతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో 30 సెంచరీలతో రికీ పాంటింగ్, 28 సెంచరీలతో సనత్ జయసూర్య ఉన్నారు.
జనవరి 17న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో తన 24వ వేగవంతమైన సెంచరీ చేసిన కోహ్లీ.. అదే మ్యాచులో వేగవంతంగా 7వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications