టెస్టు ర్యాంకులు 2018: ఈ ఏడాదిని టాప్ ర్యాంక్‌తో ముగించిన కోహ్లీ, రబాడ

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో తమ తమ నంబర్ వన్ స్థానాలను నిలబెట్టుకున్నారు. సోమవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ, బౌలర్లలో కగిసో రబాడ తమ అగ్రస్థానాలను పదిలం చేసుకున్నారు.
మెల్‌బోర్న్ వేదికగా ఆదివారంతో ముగిసిన మూడో టెస్టులో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మూడు పాయింట్లు చేజార్చుకున్నప్పటికీ 931 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 897 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం 34 పాయింట్లుగా ఉంది.

ఆసీస్ గడ్డపై రెండు టెస్ట్ సెంచరీలు చేసిన పుజారా
అడిలైడ్, మెల్‌బోర్న్ టెస్టుల్లో సెంచరీలు సాధించిన పుజారా 834 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక, మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 67వ స్థానంతో తన టెస్టు కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

10 పాయింట్లు ఎగబాకి 38వ స్థానంలో నిలిచిన రిషబ్ పంత్
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏకంగా 10 పాయింట్లు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడ 880 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. రెండో స్థానంలో జేమ్స్ ఆండర్సన్(874 పాయింట్లు), కమ్మిన్స్(836) పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

12 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌కి చేరుకున్న బుమ్రా
ఇక, మెల్‌బోర్న్ టెస్టులో 9 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 12 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌కి చేరుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో రవీంద్ర జడేజా(796 పాయింట్లు) ఏడో స్థానంలో నిలవగా, అశ్విన్(770) పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

116 పాయింట్లతో అగ్రస్థానంలో భారత్
జట్టు ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా గడ్డపై రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా, ఆ తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ (108), న్యూజిలాండ్ (107), దక్షిణాఫ్రికా (106), ఆస్ట్రేలియా (102) టాప్-5లో నిలిచాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications