రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇక మళ్లీ బ్యాట్ పట్టుకోను: విరాట్ కోహ్లీ


హైదరాబాద్: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తాను బ్యాట్‌ను ముట్టుకునేందుకు కూడా ఇష్టపడనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా శనివారం ఉదయం 7.50 గంటలకి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రిటైర్మెంట్ ప్రస్తావన వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ భారత ఆటగాళ్లను అనుమతిస్తే ఆడతారా? అన్న ప్రశ్నకు కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు. రిటైర్మెంట్ తర్వాత తాను బ్యాట్ పట్టుకోనని స్పష్టం చేశాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత
"భవిష్యత్తులో బీసీసీఐ నిర్ణయం మారుతుందో లేదో నాకు తెలియదు. నా విషయానికి వస్తే ఒకసారి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్లీ ఆడటమనేది జరగదు. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత ప్రైవేట్ లీగ్స్‌లో ఆడటం ద్వారా భవిష్యత్ మారిపోతుందని నేను అనుకోవట్లేదు. గత ఐదేళ్లలో చాలా క్రికెట్ ఆడాను. ఇంకా ఆడే అవకాశముంది. అందుకే రిటైర్మెంట్ తర్వాత మళ్లీ ఆడాలనే ఆలోచన లేదు. చాలు అనుకుంటే ఆపేస్తాను. ఇక అంతే. ఒక్కసారి ఆటకి వీడ్కోలు పలికితే ఇక మళ్లీ బ్యాట్ పట్టుకోను" అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

డివిలియర్స్, మెక్‌కల్లమ్ ప్రస్తావన
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఏబీ డివిలియర్స్, మెక్‌కల్లమ్‌లు ప్రైవేట్ లీగ్స్‌లో ఆడుతోన్న సంగతి తెలిసిందే. 2015 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మెక్‌కల్లమ్ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత అతను ఐపీఎల్, బీపీఎల్ తరహా ప్రైవేట్ లీగ్స్‌లో ఆడుతున్నారు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత
ఇక, గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక లీగ్స్‌లో ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డపై ఇటీవల ముగిసిన నాలుగు వన్డేల సిరిస్‌ను 2-1తో గెలిచి కోహ్లీసేన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతకముందు జరిగిన మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications