
ఈ ఏడాది మరో 51 పరుగులు చేసి ఉంటే
ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ 2005లో 56.66 యావరేజ్‌తో 2833 పరుగులతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది మరో 51 పరుగులు చేసి ఉంటే సంగక్కర రికార్డుని బద్దలు కొట్టి ఉండేవాడు. ఇదే కాదు ఈ ఏడాది 11 సెంచరీలు చేసిన కోహ్లీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో పాంటింగ్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు.

మరో సెంచరీ చేసి ఉంటే సచిన్ రికార్డు సమం
మరో సెంచరీ చేసి ఉంటే 12 సెంచరీలతో సచిన్ రికార్డుతో సమం చేసేవాడు. డిసెంబర్ నెలలో టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత టీమిండియా శ్రీలంతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. అయితే ఈ పరిమిత ఓవర్ల సిరిస్ నుంచి కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ ఈ సిరిస్ నుంచి తప్పుకోవడంతో ఈ రికార్డుని జేజార్చుకున్నాడు.

ఈ ఏడాది పరుగుల వరద
ఈ ఏడాది రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు. మొత్తం 46 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఇప్పటివరకు 2818 పరుగులు చేశాడు. 68.73 యావరేజితో పరుగులు చేసిన కోహ్లీ 11 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. వరుసగా రెండో ఏడాది కూడా మూడు డబుల్ సెంచరీలను నమోదు చేశాడు.

ఓ సెంచరీతోపాటు రెండు డబుల్ సెంచరీలు
కాగా, ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కోహ్లీ ఓ సెంచరీతోపాటు రెండు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసిన కోహ్లీ లంకపై మూడు టెస్టుల్లోనే 610 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్‌ల్లో కూడా కోహ్లీ 600కి పైగా పరుగులు చేశాడు.

మూడు సిరీస్‌ల్లో 600కిపైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా
2014-15లో ఆసీస్‌పై 692 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 2016-17లో ఇంగ్లాండ్‌పై 655 పరుగులు చేశాడు. తద్వారా మూడు సిరీస్‌ల్లో 600కిపైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో రాహుల్ ద్రవిడ్, సునీల్ గావస్కర్‌లు మాత్రమే రెండు సిరీస్‌ల్లో 600కు పైగా పరుగులు చేశారు.


Click it and Unblock the Notifications











