67పరుగులే: సచిన్ మరో రికార్డ్ బ్రేక్ చేయనున్న కోహ్లీ
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో అనేక రికార్డులను తన పేరున నమోదు చేశాడు. కాగా, ఇప్పటికే వాటిలో కొన్నింటిని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్‌కోహ్లి బద్దలు కొట్టేశాడు.
మాస్టర్ 234 ఇన్నింగ్స్‌ల్లో 25 శతకాలు సాధిస్తే విరాట్ కేవలం 162 ఇన్నింగ్స్‌ల్లోనే అధిగమించేశాడు. ఇక పరుగుల విషయానికొస్తే సచిన్ 171 వన్డేల్లో 38.85 సగటుతో 5828 పరుగులు చేయగా కోహ్లీ 51.51 సగటుతో 7212 పరుగులు సాధించడం విశేషం.
కాగా, ఈ ఐపీఎల్‌లో సచిన్ మరో రికార్డును కూడా బద్దలు కొట్టనున్నాడు కోహ్లి. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి తాజా సీజన్‌లో 500 పరుగులు పూర్తి చేయడానికి మరో 67 పరుగులు కావాలి.

ఇదే జరిగితే ఐపీఎల్‌లో సచిన్ సాధించిన మరో రికార్డు బద్దలవుతుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సచిన్ రెండుసార్లు 500 పైచిలుకు పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 2010లో 618, 2011లో 553 చేయగా, కోహ్లీ 2013లో 634, 2015లో 505 పరుగులు చేశాడు.
మంచి ఫాంతో ఈ సీజన్‌లో ఇప్పటికే 433 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ మిగతా మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించడం లాంఛనమే. దీంతో మూడు సీజన్లలో 500 పైగా పరుగులు చేసిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సాధిస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications