అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రెచ్చిపోయాడు. అసాధారణ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడాడాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకొని ఔరా అనిపించాడు. సహచర ఆటగాడు వాషింగ్టన్ సుందర్(60 బ్యాటింగ్) సాయంతో ఏడో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించిన రిషభ్ పంత్.. కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు.
అయితే పంత్ సెంచరీ పూర్తి చేసుకున్న క్షణాన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎగిరి గంతేసిన భారత కెప్టెన్ యువ ఆటగాడిని అభినందించేందుకు బాల్కనీలోకి పరుగెత్తుకొచ్చాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో డకౌటైన కోహ్లీ.. పంత్ సెంచరీని తానే చేసినట్లుగా ఫీలవుతూ సంతోషం వ్యక్తం చేశాడు. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Kohli running forward to Appreciate Pant.
— King 🤴🇮🇹 (@Pran33Th__18) March 5, 2021
When is your show idolo?😔 pic.twitter.com/EASAfCVheJ
జట్టులో మంచి వాతావరణం ఉందనడానికి, యువ ఆటగాళ్లకు కోహ్లీ ఇచ్చే మద్దతుకు ఇదే నిదర్శనమని కొనియాడుతున్నారు. అటు కామెంటేటర్లు కూడా కోహ్లీని మెచ్చుకున్నారు. అసాధారణ ప్రతిభ కలిగిన పంత్‌కు కోహ్లీ అండగా నిలవడం వల్లే ఈ రోజు ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేశాడని తెలిపారు. క్రెడిట్ అంతా కోహ్లీదేనని ప్రశంసించారు.
146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్ ఓ దశలో కనీసం 200 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ పంత్ తన అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టును గట్టెక్కించాడు. జోరూట్ వేసిన 84 ఓవర్ తొలి బంతిని స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన పంత్.. 115 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో కెరీర్లో మూడో సెంచరీని అందుకున్నాడు. స్వదేశంలో అతనికిది తొలి సెంచరీ. 82 బంతుల్లో అర్ధశతకం చేసిన అతను శతకాన్ని 115 బంతుల్లోనే అందుకోవడం గమనార్హం.
అయితే జేమ్స్ అండర్సన్ వేసిన ఆ మరుసటి ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన పంత్.. షార్ట్ మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న రూట్‌కు చిక్కాడు. దాంతో తీవ్ర నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్, అక్షర్ పటేల్(11)తో మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడటంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 94 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది.