సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ సరసన కోహ్లీ: ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లీ టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా మూడోరోజైన శనివారం విరాట్ కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు.
భారత్ తరఫున ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాపై 1000 పరుగులు(తొమ్మిది టెస్టుల్లో) చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకుముందు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వెయ్యికి పైగా పరుగులు చేశారు.
ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో
ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ వేసిన మూడో బంతిని స్వేర్‌లెగ్ ఆడి సింగిల్ తీయడంతో విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో డ్రింక్స్ విరామానికి 46 ఓవర్లకు గాను 115/2తో నిలిచింది.
డ్రింక్స్ విరామానికి భారత్ 115/2 (46 ఓవర్లు)
ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(18), పుజారా(24) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 130 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 250 పరుగులు ఆలౌటైన సంగతి తెలిసిందే. 191/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో 88.1 ఓవర్ల వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 44 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది.
రాణించిన భారత బౌలర్లు
భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మూడో రోజు ఆటలో భాగంగా తొలి వికెట్ మిచెల్ స్టార్క్(15) బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. 91.4 ఓవర్లో బుమ్రా వేసిన బంతిని మిచెల్ స్టార్క్(15; 34బంతుల్లో) పంత్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
భారత బౌలర్లలో బుమ్రా, ఆశ్విన్‌లు మూడేసి వికెట్లు
అప్పటికే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో కొంత సమయం ఆట నిలిచిపోయింది. మళ్లీ ఆట మొదలు కాగానే, షమీ మిగతా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అత్యధికంగా 72 పరుగులు చేశాడు. ఆ తర్వాత హ్యాండ్స్ కాంబ్ (34), కవాజా (28) పరుగులతో ఫరవాలేదనిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, ఆశ్విన్‌లు మూడేసి వికెట్లు తీసుకోగా, ఇశాంత్ శర్మ, షమీలు రెండేసి వికెట్లు తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications