
పరుగుల దాహాన్ని కొనసాగిస్తోన్న కోహ్లీ
29 ఏళ్ల విరాట్ కోహ్లీ తన పరుగుల దాహాన్ని కొనసాగిస్తున్నాడని తెలిపాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటన చేదు అనుభవాలను చెరిపివేస్తూ ప్రస్తుత సిరీస్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని, 544 పరుగులు సాధించడం గొప్ప విషయమని అన్నాడు. టెస్టుల్లో కోహ్లీ నంబర్ వన్ ఎందుకయ్యాడో ప్రపంచానికి చాటి చెప్పాడని వివరించాడు.

వారిద్దరూ గొప్ప సమకాలీన దిగ్గజాలు
బౌలర్ల విషయానికి వస్తే, ప్రస్తుత క్రికెట్‌లో జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్), కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) ఉత్తమ బౌలర్లని కొనియాడాడు. తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బౌలర్లలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియా స్పిన్న లెజెండ్ షేన్ వార్న్ ముందు వరుసలో ఉంటారని, వారిద్దరూ గొప్ప సమకాలీన దిగ్గజాలని ప్రశంసించాడు.

ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు
పక్కా ప్రణాళికతో వారి బౌలింగ్‌ను ఎదుర్కొడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని లారా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. టీ20 మ్యాచ్‌లు క్రికెట్ అభివృద్ధికి దోహదం చేస్తాయని, వన్డే వరల్డ్ కప్‌లో పది, టీ20 ప్రపంచకప్‌లో 16 జట్ల ఐసీసీ ఫార్మాట్‌ను బ్రియాన్ లారా సమర్ధించాడు.

ఒలంపిక్స్‌లో క్రికెట్ ఉంటే బాగుంటుంది
టీ20 క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెడితే బాగుంటుందని బ్రియాన్ లారా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. అత్యంత ప్రజాధరణ కలిగిన క్రికెట్ ఒలంపిక్స్‌లో లేకపోవడం తనను ఆశ్యర్యానికి గురిచేస్తోందని అన్నాడు. అతి త్వరలోనే ఒలంపిక్స్‌లో క్రికెట్ ఉండాలని ఆశిద్దామని పేర్కొన్నాడు. నాణ్యమైన క్రికెట్‌ను ఆడాలనుకునే దేశాలు మాత్రమే లాంగ్ ఫార్మట్ క్రికెట్‌ను ప్రోత్సహిస్తాయని ఓ ప్రశ్నకు సమాధానంగా లారా చెప్పాడు.


Click it and Unblock the Notifications
