ఫోటోలు: చివర్ ఓవర్ వేసే ముందు కోహ్లీ ఏం చెప్పాడంటే!
హైదరాబాద్: సిరిస్‌ను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. చివరి బంతి వరకూ అంతులేని ఉత్కంఠ రేపిన రెండో టీ20లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చివరి ఓవర్‌లో మ్యాజిక్ చేసి, భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రెండో టీ20లో చివరి ఓవర్ వేయడానికి ముందు జస్‌ప్రీత్ బుమ్రా చేసిన ఉపదేశం ఏంటో మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. 'నీ ప్రతిభను నీవు నమ్ముకో. నీలో దాగి ఉన్న స్కిల్స్‌ను బయటకు తీసేందుకు యత్నించు. నీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టినా ఫర్వాలేదు. అక్కడితో ప్రపంచం ఏమీ ఆగిపోదు. రేపు అనేది మళ్లీ ఉంటుంది' అని చివరి ఓవర్‌లో విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్‌ను కట్టడి చేసే బాధ్యతను బుమ్రాకు అప్పచెబుతూ కోహ్లీ అన్న మాటలివి.

బుమ్రా, ఆశిష్ నెహ్రాల అద్భుత ప్రదర్శనపై కోహ్లీ
బుమ్రా, ఆశిష్ నెహ్రాలు అద్భుతమైన ప్రదర్శన చేశారంటూ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. వారిద్దరూ ఇంగ్లాండ్‌పై అత్యుత్తమ బౌలింగ్ చేయడం వల్లే మూడు టీ20ల సిరిస్‌ను 1-1తో సమం చేసింది. చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగులు చేయాల్సి ఉండగా బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిలోనే జో రూట్‌ను అవుట్ చేశాడు.

చివరి ఓవర్‌లో ఆరు పరుగులు
రెండో బంతికి మోయిన్ అలీ సింగిల్ తీయగా, మూడో బంతిలో ఒక్క పరుగు కూడా రాలేదు. నాలుగో బంతిలో జొస్ బట్లర్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతిలో ఒక పరుగు లెగ్‌బై రూపంలో ఇంగ్లాండ్‌కు లభించింది. దీనితో చివరి బంతిలో ఇంగ్లాండ్ గెలవడానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి.

డెత్ ఓవర్లలో బంతులు వేయడం అనుకున్నంత సులభం కాదు
కానీ, ఆ బంతికి మోయిన్ అలీ బీట్ కావడంతో ఒక్క పరుగు కూడా లభించలేదు. భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డును స్వీకరించిన తర్వాత అతను మాట్లాడుతూ డెత్ ఓవర్లలో సమర్థంగా బంతులు వేయడం అనుకున్నంత సులభం కాదని అన్నాడు.

కోహ్లీ చెప్పిన మాటలు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి
కోహ్లీ చెప్పిన మాటలు తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయని పేర్కొన్నాడు. 'నేను గతంలో ఆఖరి ఓవర్లలో బౌలింగ్ చేసిన అనుభవం నిన్నటి మ్యాచ్ లో నాకు లాభించింది. దానికి ముందు నాలో ఆత్మవిశ్వాసాన్ని కోహ్లి రెట్టింపు చేశాడు. చివరి ఓవర్‌ను స్వేచ్ఛగా వేసే వీలు కల్పించాడు. ఎటువంటి ఒత్తిడి పెట్టుకోవద్దని కోహ్లీ సలహానే నాకు వరంలా పని చేసింది. దాంతో నేను ఒక ప్రణాళికతో బౌలింగ్ వేసే అవకాశం దొరికింది. నాపై కెప్టెన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాను' అని బూమ్రా తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications