Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ‌క‌ప్ త‌రువాత టీమిండియాలో సీనియ‌ర్లకు విశ్రాంతి: విండీస్‌తో సిరీస్‌కు దూరం?

Virat Kohli, Jasprit Bumrah likely to be rested for West Indies limited-overs series

ముంబై: ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌రువాత టీమిండియాకు చెందిన ఇద్ద‌రు లేదా ముగ్గురు ఆట‌గాళ్లు విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఈ నేప‌థ్యంలో- వెస్టిండీస్‌తో జ‌రిగే సిరీస్‌కు వారు అందుబాటులో ఉండ‌ట్లేద‌ని తెలుస్తోంది. వ‌చ్చే నెల 14వ తేదీన జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ముగుస్తుంది. మ‌రో మూడు వారాల త‌రువాత భార‌త క్రికెట్ జ‌ట్టు వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఆగ‌స్టు 3వ తేదీ నుంచి ఈ సిరీస్ ఆరంభం అవుతుంది. అమెరికా, క‌రేబియ‌న్ దీవుల్లో ఈ సిరీస్ కొన‌సాగుతుంది.

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌బోయే జ‌ట్టు నుంచి త‌మ‌కు త‌ప్పించాల‌ని భార‌త క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డును కోరిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని తాను భావిస్తున్నాన‌ని, ఈ నేప‌థ్యంలో జ‌ట్టులో త‌న‌కు చోటు క‌ల్పించ‌వ‌ద్ద‌ని ఆయ‌న ఇప్ప‌టికే మౌఖికంగా కోరిన‌ట్లు చెబుతున్నారు. విరాట్ కోహ్లీతో పాటు పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బూమ్రా, ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ సైతం ఇదే కోరిక‌ను కోరుతున్న‌ట్లు స‌మాచారం. వారి కోరిక‌ను బీసీసీఐ మ‌న్నిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఆగ‌స్టులో ఆరంభం కాబోయే వెస్టిండీస్ సిరీస్‌లో కొంద‌రు జూనియ‌ర్ల‌కు చోటు క‌ల్పించడంలో భాగంగా.. వారు బీసీసీఐకి ఈ విజ్ఞ‌ప్తి పంపించినట్లు చెబుతున్నారు. విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బూమ్రాల స్థానంలో కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది.

Story first published: Sunday, June 23, 2019, 17:20 [IST]
Other articles published on Jun 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+