Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలేం జరిగింది?: మైదానంలో విరాట్ కోహ్లీ Vs ఆండర్సన్ మాటల యుద్ధం

Virat Kohli, James Anderson involved in heated exchange during Oval Test

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో రెండో రోజైన శనివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం నడిచింది.

ఈ సంఘటన ఇన్నింగ్స్ 29వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు కారణం కెప్టెన్ విరాట్‌ కోహ్లీని అంపైర్‌ కుమార ధర్మసేన నాటౌట్‌గా ప్రకటించడమే. అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 29వ ఓవర్లో బంతి విరాట్ కోహ్లీ ప్యాడ్లను తాకింది. దీంతో అండర్సన్‌ వెంటనే అప్పీల్‌ చేసినా అంపైర్‌ ధర్మసేన అతని అప్పీల్‌ను తిరస్కరించాడు.

1
42378

రివ్యూ కోరిన ఆండర్సన్

కానీ, బంతి వికెట్లను తాకుతుందని భావించిన ఆండర్సన్ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి వికెట్లకు తాకే అవకాశం ఉన్నట్లు కనిపించినా.. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కు వదిలేశాడు. దీంతో ధర్మసేన తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అంఫైర్ ధర్మసేన దగ్గరకు వెళ్లి కోపంగా మాట్లాడిన జేమ్స్ అండర్సన్‌.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి కోపంతో ఊగిపోయాడు.

ఇద్దరు ఆటగాళ్లకు సర్ధిచెప్పిన అంఫైర్

ఇద్దరు ఆటగాళ్లకు సర్ధిచెప్పిన అంఫైర్

ఈ సమయంలో అంఫైర్ ధర్మసేన కలగజేసుకుని ఇద్దరు ఆటగాళ్లకు సర్ధిచెప్పాడు. అయితే, అండర్సన్ ఈ విధంగా కోహ్లీతో గొడవపడటానికి కారణం ఉంది. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీని జేమ్స్ ఆండర్సన్ నాలుగు సార్లు ఔట్ చేశాడు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీని జేమ్స్ ఆండర్సన్ ఔట్ చేయలేదు. ఈ సిరిస్‌లో కోహ్లీ ఇప్పటివరకు ఆండర్సన్ వేసిన 254 బంతులు ఎదుర్కొన్నాడు.

68 యావరేజితో 544 పరుగులు చేసిన కోహ్లీ

68 యావరేజితో 544 పరుగులు చేసిన కోహ్లీ

2014 పర్యటనలో విరాట్ కోహ్లీ 10 ఇన్నింగ్స్‌లాడి 134 పరుగులు చేయగా ప్రస్తుతం జరుగుతున్న సిరిస్‌లో కోహ్లీ తన రికార్డుని మరింతగా మెరుగుపరచుకున్నాడు. ఈ సిరిస్‌లో ఇప్పటికే ముగిసిన నాలుగు టెస్టుల్లో విరాట్ కోహ్లీ 68 యావరేజితో 544 పరుగులు చేశాడు. అయితే, ఓవల్ టెస్టులో విరాట్ కోహ్లీ వికెట్ తీయలేకపోయిన ఆండర్సన్ ఆ తర్వాత రెండు ఓవర్ల గ్యాప్‌లో ఛటేశ్వర్ పుజారా, రహానేలను పెవిలియన్‌కు చేర్చాడు.

 రెండో రోజు తేలిపోయిన టీమిండియా

రెండో రోజు తేలిపోయిన టీమిండియా

కాగా, ఐదో టెస్టులో తొలి రోజు ఫర్వాలేదనిపించిన భారత్‌ శనివారం మాత్రం తేలిపోయింది. ఇంగ్లాండ్‌ లోయర్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు చేర్చడంలో భారత బౌలర్లు విఫలం కావడం, మరోవైపు బ్యాట్స్‌మెన్‌ కూడా ఆకట్టుకోలేకపోయారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. పుజారా (37), రాహుల్‌ (37) ఫర్వాలేదనిపించారు.

తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసిన ఇంగ్లాండ్

తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసిన ఇంగ్లాండ్

క్రీజులో విహారి (25 బ్యాటింగ్‌), జడేజా (8 బ్యాటింగ్‌) ఉన్నారు. ఆండర్సన్‌, స్టోక్స్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. అంతకుముందు 198/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టులో జోస్ బట్లర్ (133 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 89), బ్రాడ్‌ (59 బంతుల్లో 3 ఫోర్లతో 38) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 122 ఓవర్లలో 332 పరుగుల వద్ద ముగించింది. జడేజాకు నాలుగు, బుమ్రా.. ఇషాంత్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.

Story first published: Sunday, September 9, 2018, 9:53 [IST]
Other articles published on Sep 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+