న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్ టీమిండియాకు అవసరం'

Virat Kohli is the leader India need: Krishnamachari Srikkanth

హైదరాబాద్: విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్ టీమిండియాకు అవసరమని టీమిండియా మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో కృష్ణమాచారి శ్రీకాంత్‌ మాట్లాడుతూ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు.

మెల్‌బోర్న్‌లో 3rd ODI: ఆరోన్ ఫించ్‌కు భువనేశ్వర్ గండం, హ్యాట్రిక్ (వీడియో)మెల్‌బోర్న్‌లో 3rd ODI: ఆరోన్ ఫించ్‌కు భువనేశ్వర్ గండం, హ్యాట్రిక్ (వీడియో)

"ఇప్పుడు భారత్‌ 300 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదిస్తోందంటే జట్టు విరాట్‌ కోహ్లీపై ఆధారపడుతుందని అర్థం. గణాంకాల గురించి మాట్లాడితే విరాట్‌ కోహ్లీ ఛేదనలో 24 సెంచరీలు చేయగా అందులో 21 సార్లు భారత్‌ గెలిచింది. దూకుడు, బాధ్యతల అద్భుత మేలిమి కలయిక విరాట్‌ కోహ్లీ" అని అన్నారు.

"దేశానికి తనను తాను నమ్మే, జట్టుపై విశ్వాసం ఉండే కెప్టెన్ అవసరం. ఇంతకుముందు కపిల్‌ అలా ఉన్నారని ఇప్పుడు యువ క్రికెటర్ల కోసం విరాట్‌ కోహ్లీ అలా ఉన్నాడు" అని శ్రీకాంత్‌ అన్నారు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.

ఇటీవలే కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయంతో ఈ ఘనత సాధించిన తొలి భారత, ఆసియా కెప్టెన్‌గానూ విరాట్ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు.

1
43629

దీంతో 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ 146 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ తర్వాత మెల్‌ బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

ఈ సిరిస్‌లో పుజారా 521 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, భారత బౌలర్లలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలవగా షమీ 16 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 11 వికెట్లు తీశారు.

Story first published: Friday, January 18, 2019, 11:57 [IST]
Other articles published on Jan 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X