Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరో 'డబుల్' సెంచరీ: 'ఈ తరంలో కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌'

 Virat Kohli is the ‘greatest batsman of his generation’, says Kevin Pietersen

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ కితాబిచ్చాడు. తాజాగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో విరాట్ కోహ్లీ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 156 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు కోహ్లీకి అభినందనలు తెలుపుతున్నారు. 'అతని జనరేషన్‌లో కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌. ప్రస్తుత బ్యాట్స్‌మెన్లందరిలో అతడు చాలా వినూత్నంగా ఆడుతూ రికార్డులు బద్దలుకొడుతున్నాడు' అని కెవిన్‌ పీటర్సన్ ట్వీట్ చేశాడు.

'ఈ ప్రపంచంలోనే కోహ్లీ బెస్ట్ ప్లేయర్' అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ట్వీట్ చేశాడు. 'టెస్టుల్లో రన్‌ మిషిన్‌ కోహ్లీ ఫామ్‌ చూసి భవిష్యత్‌ తరాలు రెడ్‌ బాల్‌ క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంటారు' అని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నారు. ఫిరోజ్‌షా కోట్లా వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న చివరి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ 156 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇక, ఓవర్ నైట్ స్కోరు 371/4 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతోంది. ఢిల్లీ టెస్టులో కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. రెండో రోజు సురంగ లక్మల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 107.6వ బంతికి రెండు పరుగులు తీసి ఆరో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.

ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో డబుల్‌ సెంచరీ. మొత్తంగా ఈ ఏడాది మూడోది. అంతకముందు నాగ్‌పుర్‌ టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన సొంతమైదానం ఫిరోజ్‌షా కోట్లాలో డబుల్ సెంచరీ చేశాడు. కెప్టెన్‌గా ఆరు రెండో డబుల్‌ సెంచరీలు సాధించిన ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ మాత్రమే. తాజా రికార్డుతో కెప్టెన్‌గా బ్రియన్‌ లారా 5 డబుల్‌ సెంచరీలను దాటేశాడు. ఆటగాడిగా సచిన్‌ (6), వీరేంద్ర సెహ్వాగ్‌ (6) రెండో డబుల్‌ సెంచరీలను సమం చేశాడు

Story first published: Sunday, December 3, 2017, 12:08 [IST]
Other articles published on Dec 3, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+