
ఓపెర్లుగా ఎవరంటే..
ఐసీసీ ప్రకటించిన ఈ దశాబద్దపు జట్టులో ఓపెనర్లుగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంపికయ్యారు. అలిస్టర్ కుక్ 2006 నుంచి 2018 మధ్య 13 ఏళ్లపాటు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక మరో ఓపెనర్‌గా ఎంపికైన డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానానికి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎంపికయ్యాడు.

కెప్టెన్‌గా కోహ్లీ
ఇటీవల టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తప్పుకుని సంచలన నిర్ణయం తీసుకున్న భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టెస్టు క్రికెట్లో కోహ్లీ సారథ్యంలో భారత జట్టు మంచి మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. జట్టులో కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక ఐదో స్థానానికి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ ఎంపికయ్యాడు. వికెట్ కీపర్‌గా సౌతాఫ్రికా మాజీ ఆటగాడు కుమార సంగక్కర ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్ కోటాలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ జట్టులో స్థానంలో సంపాదించుకున్నాడు.
|
స్పిన్నర్‌గా అశ్విన్
ఈ దశాబ్దపు జట్టులో స్పిన్నర్‌గా టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. ఇక పేస్ బౌలర్లుగా సౌతాఫ్రికా మాజీ దిగ్గజం డేల్ స్టెయిన్ చోటు సంపాదించుకున్నాడు. అలాగే ఇంగ్లండ్‌కు చెందిన వెటరన్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ ఎంపికయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నారు.

ఏం టీం నుంచి ఎంత మంది
ఈ జట్టులో ఇంగ్లండ్‌కు చెందిన ఆటగాళ్లే అత్యధికంగా నలుగురు ఉండడం గమనార్హం. ఓపెనర్ కుక్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లండ్ చెందిన వారే. ఆ తర్వాత భారత్ నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు చోటు సంపాదించుకున్నారు. భారత్ నుంచి కోహ్లీ, అశ్విన్.. ఆస్ట్రేలియా నుంచి వార్నర్, స్మిత్ ఎంపికయ్యారు. ఇక శ్రీలంక, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపికయ్యారు. శ్రీలంక నుంచి కుమార సంగక్కర, సౌతాఫ్రికా నుంచి డేల్ స్టెయిన్, న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్ ఈ జట్టులో చోటు సంపాదించుకున్నారు.