Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌ మెన్ కోహ్లీ: నెటిజన్లతో ఆమీర్ సమాధానం

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని పాకిస్థాన్ వెటరన్ పేసర్ మహమ్మద్ అమీర్ వ్యాఖ్యానించాడు. ట్విట్టర్ వేదికగా అమీర్ అభిమానులతో ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.

ఈ నేపథ్యంలో ఇండియాకు చెందిన కొందరు క్రికెట్ ఫ్యాన్స్ ఆమీర్‌పై కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్స్‌లో ది బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరు? ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు గాను అమీర్... విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మెన్‌గా అభివర్ణించాడు.

Virat Kohli is the best batsman in the world, says Pakistan pacer Mohammad Amir

మోడ్రన్ డే బ్యాటింగ్ దిగ్గజాల్లో రోహిత్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ.. వీరిలో బెస్ట్ ఎవరిని అడిగితే అందరూ మంచి ఆటగాళ్లే కానీ తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం కోహ్లీ బెస్ట్ అని ఆమీర్ ట్వీట్ చేశాడు.

నీ తొలి ఛాంపియన్స్ ట్రోఫీలో తీసిన సచిన్ వికెట్ తీశావు. ఈ చాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వికెట్ తీశావు. ఎవరిని ఔట్ చేసినప్పుడు ఎక్కువ ఆనందం కలిగిందని ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న వేశాడు. ఇద్దరి విషయంలో సమానంగానే సంతోషపడినట్లు ఆమీర్ ట్వీట్ చేశాడు.

మహ్మద్ ఆమీర్ గతంలో కూడా సందర్బం వచ్చినప్పుడల్లా కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకునే వాడు. కోహ్లీ కూడా ఆమీర్‌ బౌలింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించడంలో అమీర్ కీలకపాత్ర పోషించాడు.

కోహ్లీని తక్కువ పరుగులకే అమీర్ పెవిలియన్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. 6-2-16-3 అద్భుతమైన స్పెల్‌తో పాకిస్థాన్‌కు విజయాన్ని అందించాడు. రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (21), విరాట్ కోహ్లీ (5) కీలక వికెట్లను తీసి పాకిస్థాన్‌కు ఫైనల్లో విజయాన్ని అందించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+