'టెస్ట్ ఫార్మాట్‌లో ఉత్తమ బ్యాట్స్‌మన్ అని కోహ్లీ ఇప్పటికే నిరూపించాడు'

ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ఇక టెస్ట్ ఫార్మాట్‌లో కూడా ఉత్తమ బ్యాట్స్‌మన్ అని కోహ్లీ ఇప్పటికే నినిరూపించుకున్నాడు అని దక్షిణాఫ్రికా స్టార్ పేసర్‌ కగిసో రబడ పేర్కొన్నాడు. టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడడానికి దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15 నుంచి భారత్ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ సందర్భంగా రబడ మాట్లాడాడు.

వెస్టిండీస్ వన్డే, టీ20 కెప్టెన్‌గా కీర‌న్ పొలార్డ్!!

కోహ్లీ ఉత్తమ బ్యాట్స్‌మన్

కోహ్లీ ఉత్తమ బ్యాట్స్‌మన్

తాజాగా రబడ మాట్లాడుతూ... 'టెస్ట్ ఫార్మాట్‌లో ఉత్తమ బ్యాట్స్‌మన్ అని కోహ్లీ ఇప్పటికే నిరూపించుకున్నాడు. తన అద్భుత ఆటతో గొప్ప ఆటగాడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతనికి బౌలింగ్ చేస్తే.. ఒక బౌలర్‌గా మనలో సత్తా ఎంత ఉందో తెలుస్తుంది. కోహ్లీ గొప్ప పోరాట యోధుడు. మ్యాచ్ చివరి వరకు పోరాడుతాడు. అయినా మాకు భయం లేదు. ఈ సిరీస్‌లో కష్టపడతాం' అని రబడ తెలిపాడు.

బుమ్రా అద్భుతాలు చేస్తున్నాడు:

బుమ్రా అద్భుతాలు చేస్తున్నాడు:

'జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇతర ఫాస్ట్ బౌలర్లను కూడా నేను ప్రశంసిస్తా. ఇది ఆరోగ్యకరమైన పోటీగా మారుతుంది. ఇద్దరు తక్కువ కాలంలోనే అద్భుత ప్రదర్శన చేసి జట్టులో రెగ్యులర్‌ ఆటగాళ్లగా మారారు. తమ ప్రదర్శనతో ప్రత్యేక స్థానం కూడా సంపాదించుకున్నారు. ఆర్చర్‌ సహజసిద్ధమైన బౌలర్. బుమ్రా బంతితో అద్భుతాలు చేస్తున్నాడు' అని రబడ పేర్కొన్నాడు.

 ఈ సిరీస్ మాకు సవాల్:

ఈ సిరీస్ మాకు సవాల్:

'ప్రొటీస్ జట్టు మొత్తం కుర్రాళ్లతో నిండి ఉంది. రాబోయే రెండు సంవత్సరాలు మాకు ఒక సవాలు. జట్టు సామర్ధ్యాలపై నమ్మకం ఉంది. భారత పర్యటనలో ఎలా రాణిస్తామో చూడాలి. గత కొన్నేళ్లుగా టీమిండియా విజయవంతమైన జట్టు. కానీ.. మా జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. యువకులు జట్టులోకి వచ్చారు. ఇంతకు ముందు ఇక్కడ ఆడని వారికి ఇది ఒక సవాలు. కుర్రాళ్లతో ఆడడం ఆనందంగా ఉంది. విజయాలు సాధిస్తాం అని నమ్మకంగా ఉన్నాం' అని రబడ చెప్పుకొచ్చారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, September 9, 2019, 15:32 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X