For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి ఎవరూ పోటీలేరు.. అతడికి అతడే పోటీ!!

Virat Kohli Is The Benchmark, He's Not Chasing Anybody - Ravi Shastri || Oneindia Telugu
Virat Kohli Is The Benchmark, He Is Not Chasing Anybody says Ravi Shastri

చెన్నై: 'రికార్డుల రారాజు' టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. కోహ్లీ రోజు రోజుకి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్నాడు. కొత్త రికార్డులను సృష్టిస్తూ తన రికార్డులను తిరగ రాస్తున్నాడు. కోహ్లీకి ఎవరూ పోటీలేరు, అతడికి అతడే పోటీ అని రవిశాస్త్రి అంటున్నారు. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా కోహ్లీ భారీ స్కోర్ల‌తో హ‌డలెత్తిస్తున్నాడు. క‌ళ్లు చెదిరే షాట్ల‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోస్తూ టీమిండియాకు సునాయాస విజయాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

క్రీడలకు కోహ్లీనే ప్రచారకర్త:

క్రీడలకు కోహ్లీనే ప్రచారకర్త:

తాజాగా ఇండియా టుడే కార్యక్రమం 'ఇన్‌స్పైర్‌'లో రవిశాస్త్రి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. 'కోహ్లీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌, అంబాసిడర్‌గా కోహ్లీ అదరగొడుతున్నాడు. క్రీడలకు కోహ్లీనే ప్రచారకర్త. ప్రపంచంలో ఏ పిల్లాడిని అయినా అడగండి.. కోహ్లీ ఆటను చూడటానికి ఇష్టపడతాం అని ఎక్కువ మంది చెబుతారు. అంతలా కోహ్లీ ప్రభావితం చేసాడు' అని రవిశాస్త్రి అన్నారు.

కోహ్లీ ఓ బెంచ్‌మార్క్‌:

కోహ్లీ ఓ బెంచ్‌మార్క్‌:

'అంతెందుకు నేను బాల్యంలో ఉన్నా కోహ్లీ ఆటనే చూసేవాణ్ణి. అతడు అంత అద్భుతంగా ఆడతాడు. మైదానంలో జట్టు గెలుపు కోసం కడవరకు పోరాడతాడు. ప్రతి రోజు పరుగులు చేసేందుకు ఇష్టపడుతాడు. ఇక డ్రెస్సింగ్ రూంలో సరదాగా ఉంటాడు. అతడో బెంచ్‌మార్క్‌. ఇక ఆట విలువల్ని కూడా గొప్పగా పాటిస్తాడు. ప్రతి బాలుడికి అతడు రోల్‌ మోడల్‌' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

అతడికి అతడే పోటీ:

అతడికి అతడే పోటీ:

'కోహ్లీ రోజు రోజుకి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్నాడు. అతడికి ఎవరూ పోటీలేరు. అతడికి అతడే పోటీ. కొత్త రికార్డులను సృష్టిస్తూ తన రికార్డులను తిరగ రాస్తున్నాడు. దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కూడా అలానే చేశాడు. సెంచరీలు చేయడం అంత సులువైనది కాదు. కోహ్లీ ఎవరిని అనుకరించడు. విరాట్‌ కోహ్లీ శకాన్ని మనం ఆస్వాదించాలి' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

అన్ని ఫార్మాట్లలో టాప్‌-10:

అన్ని ఫార్మాట్లలో టాప్‌-10:

తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతంగా ఆడాడు. మూడు టీ2లో వరుసగా 94, 19, 70 పరుగులు చేయడంతో ఐసీసీ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ల్లో అన్ని ఫార్మాట్లలో టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. టెస్టుల్లో, వన్డేల్లో అగ్రస్థానంలో ఉండగా.. టీ20ల్లో పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (1288 పరుగులు, 23 మ్యాచుల్లో) మొదటి వరుసలో ఉన్నాడు. అంతేకాదు ఈ ఏడాదిలో అన్నిఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలుస్తున్నాడు.

Story first published: Sunday, December 15, 2019, 19:05 [IST]
Other articles published on Dec 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+