Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు కోట్లల్లో వ‌సూలు చేస్తున్న విరాట్ కోహ్లీ

Virat Kohli is taking Rs.5.05 crore for a single Instagram post

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్‌డేట్‌ల‌ను సోష‌ల్ మీడియాతో పంచుకుంటూ ఉంటాడు. దీంతో కోహ్లీని ఫాలో అయ్యే అభిమాన ఘ‌నం కూడా భారీగానే ఉంది. ఈ క్ర‌మంలో ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జాల్లో తాను పోస్ట్ చేసే పోస్టుల‌కు విరాట్ కోహ్లీ ఎన్ని డ‌బ్బులు తీసుకుంటాడ‌నే చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త వైర‌ల్‌గా మారింది.

 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్న కోహ్లీ

కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్న కోహ్లీ

ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పెట్టే ఒక్కో పోస్టుకు విరాట్ కోహ్లీ ఏకంగా 5.05 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని యూకేకు చెందిన హాపర్ హెచ్ క్యూ సంస్థ ప్ర‌క‌టించింది. దీంతో భార‌త సెల‌బ్రెటీల‌లో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు అత్య‌ధికంగా వ‌సూలు చేస్తున్నది విరాట్ కోహ్లీనే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూస్తే కోహ్లీ 19వ స్థానంలో ఉన్నాడు.

అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు అత్య‌ధిక వ‌సూల్ చేస్తున్న టాప్ 20 జాబితాలో భార‌త్ నుంచి కోహ్లీ మాత్రమే ఉన్నాడు. ఇన్‌స్ట్రామ్‌లో అత్య‌ధిక ఫాలోవర్లు ఉన్న భార‌త సెల‌బ్రెటీగానూ కోహ్లీ నిలిచాడు. ఇన్‌స్ట్రామ్‌లో కోహ్లీకి 177 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. అంతేకాకుండా 150 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల మార్క్‌ను చేరుకున్న మొద‌టి భార‌త‌ సెల‌బ్రెటీ కోహ్లీనే.

మొద‌టి స్థానంలో ఫుట్ బాల్ స్టార్

మొద‌టి స్థానంలో ఫుట్ బాల్ స్టార్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు అత్య‌ధికంగా వ‌సూల్ చేస్తున్న వారి జాబితాలో స్టార్ ఫుట్ బాల్ ఆట‌గాడు క్రిస్టియానో రోనాల్డో మొద‌టి స్థానంలో ఉన్నాడు. రోనాల్డో ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు 11 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రోనాల్డోకి ఏకంగా 300 మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ జాబితాలో మ‌రో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఏడో స్థానంలో ఉన్నాడు. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు మెస్సీ 8.6 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేస్తున్నాడు.

Virat Kohli To Miss IND VS SA ODI Series కారణాలు ఎన్నో... | Oneindia Telugu
నెట్స్‌లో శ్ర‌మిస్తున్న కోహ్లీ

నెట్స్‌లో శ్ర‌మిస్తున్న కోహ్లీ

ప్ర‌స్తుతం సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ కేప్‌టౌన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మూడో టెస్టు మ్యాచ్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల‌ను భార‌త్, సౌతాఫ్రికా చెరోటి గెలుచుకోవ‌డంతో మూడో టెస్టు మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవ‌రనేది తేల‌నుంది. గాయం కార‌ణంగా రెండో టెస్టు మ్యాచ్‌కు దూర‌మైన కోహ్లీ మూడో టెస్టులో ఆడ‌డం ఖాయ‌మైంది. దీంతో ఆ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించి జ‌ట్టును గెలిపించాల‌ని కసిగా ఉన్నాడు. త‌ద్వారా సౌతాఫ్రికా గ‌డ్డ‌పై తొలిసారి టెస్టు సిరీస్ గెల‌వాల‌ని కోహ్లీ ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడు.

Story first published: Monday, January 10, 2022, 11:01 [IST]
Other articles published on Jan 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+