Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'కోహ్లీ నెగిటివ్‌గా ఆలోచిస్తున్నాడు, అందుకే ఎల్బీడబ్ల్యూ'

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మార్క్ వా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ నెగిటివ్‌గా ఆలోచిస్తున్నాడని అందుకే అతడికి ఏకాగ్రత కుదరడం లేదని మార్క్ వా అభిప్రాయపడ్డాడు.

ఫాక్స్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మార్క్ వా మాట్లాడుతూ దీని ప్రభావం భారత జట్టులోని ఇతర సభ్యులపై పడుతోందని అతడు ఆరోపించాడు. బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 15 పరుగులకే అవుటైన సంగతి తెలిసిందే.

దీనిపై విరాట్ కోహ్లీ రివ్యూ అడిగాడు. అయితే ప్రపంచస్థాయి ఆటగాడైన కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్టు గ్రహించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నాడు. నెగటివ్‌గా ఆలోచించడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని వా పేర్కొన్నాడు.

Virat Kohli is suffering from a ‘brain fade’ against Australia, says Mark Waugh

కోహ్లీ పాజిటివ్‌గా ఆలోచిస్తే సానుకూల ఫలితాలు సాధించవచ్చని మార్క్ వా సలహా ఇచ్చాడు. కాగా, రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ దుర‌దృష్ట‌వ‌శాత్తు అవుటయ్యాడు. హెజిల్ ఉడ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఎల్బీడ‌బ్ల్యూగా అవుటైనట్లు అంఫైర్ ప్రకటించాడు.

15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హజెల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో స్పిన్ బౌలింగ్‌లో అవుటైన కోహ్లీ, ఈసారి మాత్రం పాస్ట్ బౌలర్‌ హజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కానీ అది ఇన్‌సైడ్ ఎడ్జ్ అని బలంగా న‌మ్మిన కోహ్లీ వెంట‌నే రీవ్యూ కోరాడు. ఆ త‌ర్వాత రీప్లేల్లో అది స్ప‌ష్టంగా క‌నిపించ‌లేదు.

రివ్యూలో రెండు శబ్ధాలు వినిపించాయి. కానీ బంతి మొద‌ట బ్యాట్‌ను తాకిందా? లేక ప్యాడ్‌నా అన్న‌ది స్ప‌ష్టంగా క‌నిపించ‌లేదు. దీంతో థ‌ర్డ్ అంపైర్ కెటిల్‌బ‌రో మాత్రం ప్యాడ్‌కు త‌గిలిన‌ట్లే భావించాడు. తద్వారా హాక్ఐ ద్వారా బంతి గ‌మ‌నాన్ని గ‌మ‌నించి విరాట్‌ కోహ్లీని అవుట్‌గా ప్ర‌క‌టించాడు. దీనిపై కోహ్లీ స్టేడియంలో నుంచి అసంతృప్తిగానే వెనుదిర‌గాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+