న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కెప్టెన్‌గా ఇంకా ఎదుగుతూ ఉన్నాడు: వీవీఎస్ లక్ష్మణ్

Virat Kohli is still a work in progress as captain: VVS Laxman to India Today

ముంబై: వరుస సిరీస్‌లతో అలసిపోతున్న క్రమంలో కొన్నింటికీ విరామం చెప్తూ.. కీలకమైన సిరీస్‌లలో టీమిండియా కెప్టెన్సీ వహిస్తోన్న విరాట్ కోహ్లీ బాధ్యతలను సరిగా నిర్వర్తించాలంటే ఇంకా పరిణతి చెందాలని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. బ్యాట్స్‌మన్‌గా మైదానంలో తనదైన శైలిలో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తున్న విరాట్‌ కోహ్లీ.. కెప్టెన్‌గా మరికొన్ని విషయాల్లో మెరుగుపడాలని సూచించాడు.

విధానం సహచర ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకంగా

విధానం సహచర ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకంగా

ఒక బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ ఎలాంటి పరిస్థితులనైనా తను ఛాలెంజింగ్‌గా తీసుకుని అనుకూలంగా మార్చుకోగలడు. మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే దృక్పథంతోనే అతను బరిలోకి దిగుతాడు. ముందున్న సవాళ్లను ఎంతో బాధ్యతగా, ఇష్టంగా ఎదుర్కొంటాడు. ఆ విధానం సహచర ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అయితే జట్టును ముందుండి నడిపించే కెప్టెన్‌గా అతను ఇంకా విజయవంతం కావాలంటే.. మరికొన్ని విషయాల్లో పరిణతి సాధించాల్సి ఉంది.

ఆసీస్‌ను వారి గడ్డపైనే ఓడించేందుకు

ఆసీస్‌ను వారి గడ్డపైనే ఓడించేందుకు

ఇదే ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాపై, సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌ ఓటమి అనంతరం.. కోహ్లీ నేతృత్వంలో టీమిండియా మళ్లీ విదేశీ గడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ఆడనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆసీస్‌ను వారి గడ్డపైనే ఓడించి టెస్టు సిరీస్‌ కైవసం చేసుకోవడానికి భారత్‌కు ఇదే గొప్ప అవకాశమని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కోహ్లీ ఇంకా విజయవంతం కావాలంటే

కోహ్లీ ఇంకా విజయవంతం కావాలంటే

‘కెప్టెన్‌గా కోహ్లీ ఇంకా విజయవంతం కావాలంటే అతను విదేశీ గడ్డపై ఎక్కువ సంఖ్యలో టెస్టు మ్యాచ్‌లాడాలి. అలా అయితేనే అధికంగా విజయాలు సాధించి ఒక కెప్టెన్‌గా మరింత అనుభవం గడించే అవకాశం ఉంటుంది.' అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు.

గొప్ప కెప్టెన్‌గా నిలుస్తాడనటంలో

గొప్ప కెప్టెన్‌గా నిలుస్తాడనటంలో

‘నేను చూసిన చాలామంది కెప్టెన్లు నాయకత్వాన్ని అదనపు భారంగా భావించేవారు. దానితో ఎంతో ఒత్తిడికి గురయ్యేవారు. కానీ కోహ్లీ అలా కాదు. ఒక బ్యాట్స్‌మెన్‌గా బాధ్యతగా ఆడుతూనే జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇలాగే ఇంకొన్ని విషయాల్లో పరిణతి సాధిస్తే అతను గొప్ప కెప్టెన్‌గా నిలుస్తాడనటంలో ఎలాంటి సందేహం లేదు' అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

Story first published: Sunday, November 25, 2018, 14:02 [IST]
Other articles published on Nov 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X