ధోనిలో వచ్చిన మార్పునకు కారణం కోహ్లీనే: గంగూలీ
హైదరాబాద్: గత ఏడాది కాలంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటలో వచ్చిన మార్పునకు కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీయేనని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో ధోనిపై కోహ్లీ ఎంతో నమ్మకం ఉంచాడని చెప్పుకొచ్చాడు.
సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనికి పరుగులు ఎలా సాధించాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకపోయినా అతనిపై కోహ్లీకి విపరీతమైన నమ్మకం ఉందని గంగూలీ తెలిపాడు. దీని కారణంగానే ధోనిలో నూతన ఆటగాడ్ని చూస్తున్నామని గంగూలీ పేర్కొన్నాడు.

300 వన్డేలకు పైగా ఆడాడు
'ధోని తన కెరీర్‌లో 300 వన్డేలకు పైగా ఆడాడు. పరుగులు ఎలా సాధించాలో అతడికి చెప్పాల్సిన పని లేదు. ఆ క్రమంలోనే తొమ్మిది వేలకు పైగా పరుగుల్ని కూడా సాధించాడు. అయితే అతని నుంచి ఇంకా మ్యాచ్ ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు వస్తూనే ఉన్నాయి' అని గంగూలీ తెలిపాడు.

అందుకు కారణం కెప్టెన్ కోహ్లీనే
'అందుకు కారణం కెప్టెన్ కోహ్లీనే. అంతేకాదు ఆ క్రెడిట్ మొత్తం కూడా కోహ్లీకే ఇవ్వాలి. ఎందుకంటే ధోనిపై కోహ్లీ నమ్మకం ఉంచాడు. అదే సమయంలో ధోనికి స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కోహ్లీ కల్పిస్తున్నాడు. ధోనిలో ఆటలో మరింత మార్పు రావడానికి కోహ్లీదే కీలక బాధ్యత' అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

19 మ్యాచ్‌లాడి 89.57 యావరేజితో 627 పరుగులు
ఈ ఏడాది ధోని మొత్తం 19 మ్యాచ్‌లాడి 89.57 యావరేజితో 627 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ను కోహ్లీసేన క్లీన్ స్వీప్ చేయడంలో ధోని కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో 79 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించాడు.

తొలి వన్డేలో ధోని వందో హాఫ్ సెంచరీ
అంతేకాదు తన అంతర్జాతీయ కెరీర్‌లో ధోని వందో హాఫ్ సెంచరీని సాధించాడు. టెస్టుల్లో 66 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 33, టీ20ల్లో ఒక హాఫ్ సెంచరీతో ధోని ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇలా వందో హాఫ్ సెంచరీ అందుకున్న భారత క్రికెటర్ల జాబితాలో నాలుగో స్ధానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications