For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కెప్టెన్ గానే కాదు.. బ్యాట్స్‌మన్ గానూ సూపరే..!

Virat Kohli is proving to be an outstanding batsman of his era: Greg Chappell heaps praise on Indian skipper

నాటింగ్ హామ్: భారత్ రెండు సిరీస్‌ల వైఫల్యం గురించి విమర్శిస్తూనే కోహ్లీ కెప్టెన్‌గానూ బ్యాట్స్‌మన్ గానూ అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు ఆసీస్ మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్. ఈ తరం క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమం అని ప్రశంసించాడు. బ్యాటింగ్‌తో పాటు అతడి నాయకత్వ నైపుణ్యాలు చాలా బాగున్నాయని పేర్కొన్నాడు. ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రహానెతో అతడి భాగస్వామ్యం నిర్ణయాత్మకమని వెల్లడించాడు.

'పర్యటించిన ప్రతి చోటా పరుగులు చేస్తూ విరాట్‌ కోహ్లీ ఈ తరం అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని నిరూపించుకుంటున్నాడు. సహచరులతో అద్భుత భాగస్వామ్యాలు నిర్మిస్తున్నాడు. కష్టతరమైన పిచ్‌లపై అలవోకగా పరుగులు చేస్తున్నాడు. ఈ పర్యటనకు బయలుదేరే ముందు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాను వారి సొంత దేశాల్లో ఓడించే అవకాశం టీమిండియాకు కనిపించింది. కోహ్లీసేన దీనిని సాధిస్తే అందరూ ప్రశంసించాల్సిందే.'

'ఇంగ్లాండ్‌తో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియా ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో కనిపిస్తోంది. ఈ సిరీస్‌ ఓడితే మాత్రం స్మిత్‌, వార్నర్‌ లేని ఆసీస్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భారత్‌ ఒక వేళ రెండు సిరీస్‌లను ఓడిపోతే మాత్రం నిందించాల్సిందే' అని ఛాపెల్‌ అన్నాడు.

చాపెల్‌తో పాటుగా మరికొన్ని విదేశీ క్రికెటర్లు అయిన స్టీవ్‌వా, కుమార సంగక్కర‌, ఇయాన్‌ ఛాపెల్‌ సైతం విరాట్‌ను అత్యుత్తమ క్రికెటర్‌ అంటూ ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ సిరీస్‌ ముగిసిన తర్వాత కోహ్లీసేన ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

Story first published: Sunday, August 26, 2018, 10:51 [IST]
Other articles published on Aug 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+