Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కసివున్న ఆటగాడు: విరాట్ కోహ్లీపై అనుష్క శర్మ ప్రశంసలు

న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రశంసల జల్లు కురిపించింది. విరాట్ కోహ్లీ ఎంతో కసివున్న ఆటగాడని పొగడ్తలతో ముంచెత్తింది. 'ఎన్‌హెచ్ 10' ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విరాట్ ప్రదర్శనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ కప్‌‌లో కోహ్లీ రాణించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.

పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ చాల ముఖ్యమైనదని తెలిపింది. క్రికెట్ చూడని వారు కూడా పాకిస్థాన్-ఇండియా మ్యాచ్ అంటే చాలా ఆసక్తి చూపుతారని చెప్పింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు వెల్లడించింది.

Virat Kohli is a passionate player: Anushka Sharma

విరాట్ కోహ్లీ ఎంతో ఉత్సాహవంతమైన క్రికెటర్ అని, పాషనేట్ ఆటగాడని కొనియాడింది. గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరూ ఇటీవలే తమ అనుబంధాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ఉన్న సమయంలో కోహ్లీ కోసం అనుష్క శర్మకు అక్కడికెళ్లింది. అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ షికార్లు కొట్టారు. ఆ తర్వాత కూడా వారిద్దరూ తరచూ కలుసుకుంటూనే ఉన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+