Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mohammad Rizwan : కోహ్లీ అగ్రెస్సివ్ అన్నారు కానీ.. నేరుగా కలిసిన తర్వాత అతనేంటో తెలిసింది

Virat Kohli is not an aggressive player, Mohammad Rizwan says he is very gentle

పాకిస్థాన్ వికెట్ కీపర్ కం బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన టీ20 ప్రపంచ‌కప్‌లో టీమిండియ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం అప్పటి టీమిండియా కెప్టెన్‌ కోహ్లీతో మాట్లాడినప్పుడు అతను ఎంతో మంచివాడో అర్థమైందని రిజ్వాన్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ముగిశాక కోహ్లీ రిజ్వాన్, బాబర్ అజామ్‌లను హగ్ చేసుకున్నాడు. కోహ్లీతో పాటు ఆ మ్యాచ్‌కు ముందు ధోనీని కలిసినప్పుడు తనతో ధోనీ ఎంత సౌమ్యంగా మాట్లాడడో కూడా రిజ్వాన్ గుర్తుచేసుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాకు ధోనీ మెంటార్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత భారత ప్లేయర్లు తన పట్ల చూపించిన ఆప్యాయతకు తాను నిజంగా పొంగిపోయానని రిజ్వాన్ పేర్కొన్నాడు
.
ఇక ఈ మ్యాచ్‌ అనంతరం నేను కోహ్లీని కలవడం అదే తొలిసారి. అతని గురించి నేను అంతకుముందు విన్నవి వేరే.. నేరుగా కలిసినప్పుడు అతను నా పట్ల చూపిన విధేయత వేరు. చాలామంది అంటుంటారు విరాట్ కోహ్లీ చాలా దూకుడు పర్సన్ అదీ ఇది అని. కానీ మ్యాచ్‌కి ముందు, తర్వాత నన్ను విరాట్ కలిసిన తీరు మాత్రం ఎంతో ప్రేమాభావంతో ఉంది. అతను మన విరాట్‌ కోహ్లీ అని నేను అన్నానంటే దానికి కారణం అతను నా పట్ల చూపిన ఆప్యాయత. అలాగే మా అందరిదీ క్రికెట్ కుటుంబం. సహజంగానే మేము గ్రౌండ్లోకి ఎంటర్ అయినాక ఎవరూ స్టార్ కాదు. అని రిజ్వాన్.. వహీద్ యూట్యూబ్ షో క్రికెట్ బాజ్‌లో పేర్కొన్నారు.

ఇకపోతే ఈ ఏడాది ఆగస్టులో టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు అయిన పాక్, ఇండియా తలపడనున్నాయి. ఇక అక్టోబర్లో ఐసీసీ వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. గత ఏడాది దుబాయ్‌లో టీమిండియా 10వికెట్ల తేడాతో ఓడిపోవడంతో లెక్కకు లెక్క సరిచేయాలని చూస్తోంది.

Story first published: Tuesday, June 7, 2022, 23:06 [IST]
Other articles published on Jun 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+