ధోని నుంచి కెప్టెన్సీ ట్రిక్స్ నేర్చుకుంటున్నా: కోహ్లీ
హైదరాబాద్: ఇటీవలే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ అపారమైన అనుభవం నుంచి అనేక విలువైన సలహాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. మూడో టీ20 విజయానంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనికున్న అపారమైన కెప్టెన్సీ అనుభవం వల్ల తాను సులభంగా టెక్నిక్స్‌ను నేర్చుకోగులుతున్నట్లు పేర్కొన్నాడు. 'టెస్టు ఫార్మెట్‌లో కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ధోని కెప్టెన్సీ అనుభవం నాకు చాలా ఉపయోగపడుతుంది' అని కోహ్లీ చెప్పాడు.

ధోని సలహా మేరకు బుమ్రాకి బౌలింగ్
యుజవేంద్ర చాహల్ బౌలింగ్ కోటా పూర్తి అయిన తర్వాత తాను నెహ్రాను బౌలింగ్‌కు దింపాలని అనుకున్నానని, అయితే ధోని, కోహ్లీ సలహా మేరకు బుమ్రా చేతికి 19వ ఓవర్‌ని వేయించానని చెప్పుకొచ్చాడు. చివరి మూడు బంతుల్లో బుమ్రా రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ తొందరగా ముగిసిపోయిందని కోహ్లి అన్నాడు.

ఆశ్రయిస్తున్నా
ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మెట్‌లో ఈ తరహా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధోనిని ఆశ్రయిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఇక బెంగుళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో భారత్ కైవసం
దీంతో మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో టీమిండియా సొంతం చేసుకుంది. భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై టీమిండియాకిది హ్యాట్రిక్ సిరీస్ విజయం. మూడు టీ20లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications