Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కూడా ఓ మనిషే అతనికీ విశ్రాంతి కావాలి: రవిశాస్త్రి

Virat Kohli is human, not a machine, says Ravi Shastri

హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో సర్రే తరపున కౌంటీ క్రికెట్‌లో ఆడాల్సి ఉన్న కోహ్లీ వెన్నెముక గాయం కారణంగా తప్పుకున్నాడు. అతనికి దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించడంతో తప్పని పరిస్థితుల్లో ఆగిపోవాల్సి వచ్చింది. అయితే కోహ్లీ కౌంటీల్లో ఆడతానంటే నిరాకరించిన వాళ్లతో పాటుగా, ఆడలేకపోతున్నందుకు అంతే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాలను టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఖండించారు.

విరాట్ కోహ్లి పరుగుల యంత్రం కాదు, అతను కూడా అందరిలాంటి మనిషే, అందరిలా విశ్రాంతి కావాలని టీమిండియా కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. మెడ గాయం కారణంగా వెన్నెముకు విశ్రాంతి కావాలని సర్రే తరఫున కౌంటీ క్రికెట్‌కు కోహ్లి దూరమైయ్యాడని తెలిపాడు. వెనుక నుంచి రాకెట్ ఇందనాన్ని ఉంచి అతణ్ని మైదానంలోకి పంపలేం కదా.. అంటూ శాస్త్రి ఒకింత సహనంగా మాట్లాడాడు.

కోహ్లి టాప్ డాగ్ అంటూ ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. అతడు టాప్ డాగ్ కాదంటూ శాస్త్రి కామెంట్ చేశాడు. కోహ్లికి గాయం కావడం పట్ల సర్రే జట్టు యాజమాన్యం తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. విరాట్ కౌంటీల్లో ఆడితే చూడాలని అభిమానులు ఎంతో ఆశించారు.

కానీ బీసీసీఐ మెడికల్ టీం తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తామని సర్రే డైరెక్టర్ అలెక్ స్టెవార్ట్ తెలిపారు. కోహ్లి సర్రే తరఫున ఆడటం లేదని ఇంగ్లాండ్ ప్రకటించగానే.. అతడి ఆట చూడటం కోసమే టికెట్లు కొనుగోలు చేశాం. డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారా..? అని సర్రే క్రికెట్ క్లబ్ హోం పేజీలో కొందరు కామెంట్ పోస్ట్ చేశారు.

Story first published: Friday, May 25, 2018, 13:59 [IST]
Other articles published on May 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+