కోహ్లీని మించిన ఆటగాడు వన్డే చరిత్రలో లేడు: క్లార్క్ ప్రశంస


హైదరాబాద్: వన్డే ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ప్రశంసించాడు. కోహ్లీ గొప్ప ఆటగాడిగానే కాకుండా తెలివైన కెప్టెన్ అంటూ క్లార్క్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసీస్ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ గెలిచిన ఏకైక భారత, ఆసియా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పడం సాధారణ విషయం కాదని అన్నాడు.
"నా అభిప్రాయం ప్రకారం కోహ్లీని మించిన ఆటగాడు వన్డే చరిత్రలో లేడు. భారత్ తరఫున అతడు సాధించిన రికార్డులను గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. కోహ్లీ వయసు ముప్పైయేనని మరింత క్రికెట్ ఆడే అవకాశం ఉన్నందున్న మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. మ్యాచ్‌లను గెలిచేందుకు అతడు పడే తాపత్రయాన్ని మనం గౌరవించాలి" అని అన్నాడు.

కోహ్లీకి దూకుడెక్కువ
"కోహ్లీకి దూకుడెక్కువ కానీ అతని అంకితభావాన్ని, సాధించిన ఘనతలను ఎవరూ ప్రశ్నించలేరు. అందుకే వన్డేల్లో అతడే బెస్ట్. ఇక, టెస్టుల్లోనూ ప్రస్తుతం కోహ్లి అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికీ మరింత రాటు దేలాల్సిన అవసరముంది. ప్రపంచంలోని అన్ని మైదానాలలోనూ అతడు గొప్పగా రాణించాల్సిన అవసరముంది. అలా అయితేనే టెస్టుల్లో కూడా ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు" అని క్లార్క్ చెప్పుకొచ్చాడు.

ఇప్పటివరకు 10,385 పరుగులు చేసిన కోహ్లీ
ఇప్పటివరకు 219 వన్డేల్లో 59కి పైగా సగటుతో 39 సెంచరీలతో 10,385 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ధోనీ మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడే బ్యాట్స్‌మన్ అని, వరల్డ్‌కప్‌లో అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా రాణిస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటే సమతూకంగా ఉంటుందని, కచ్చితంగా అతడు వరల్డ్‌కప్ ఆడతాడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.
ఆక్లాండ్‌లో అడుగుపెట్టిన టీమిండియా
ఆసీస్ గడ్డపై చారిత్రక సిరీస్‌లు గెలిచిన అనంతరం న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు ఆక్లాండ్‌లో అడుగుపెట్టింది. జనవరి 23న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆక్లాండ్ విమానాశ్రయం నుంచి భారత ఆటగాళ్లు బయటకు వస్తున్న వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో ఉంచింది.

నేపియర్‌లో భారత్-న్యూజిలాండ్‌ల మధ్య తొలి వన్డే
టీమిండియాకు అక్కడి అభిమానులు సాదరంగా స్వాగతం పలికారు. కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్ ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించగా.. విరాట్ కోహ్లీ, అనుష్కకు గట్టిగా అరిచి వెల్‌కమ్ చెప్పారు. బుధవారం నేపియర్‌లో జరిగే తొలి వన్డే కోసం భారత జట్టు సోమవారం బయల్దేరి వెళ్లనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications