For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్రస్ట్రేషన్‌లో కోహ్లీ, నాతో అప్పుడు ఆలా చేశాడు : జాన్సన్

కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. పరుగులు తీయలేని స్థితిలో కోహ్లీ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడని అన్నాడు.

By Pratap

మెల్బోర్న్: పరుగులు చేయలేకపోతున్న స్థితిలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అన్నాడు. డిఆర్ఎస్ అపీల్ విషయంలో ఇరు జట్ల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

మ్యాచులో మధ్యలో ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం గమనించే ఉంటారని, భారత్ ఆస్ట్రేలియాను అధిగమించి ముందుకు సాగిందని ఆయన అన్నాడు. సహజంగానే వికెట్ పడిపోయిన వెంటనే కోహ్లీ రియాక్షన్ కోసం కెమెరాలన్నీ అటు వైపు తిరుగుతాయని, అతని రియాక్షన్స్‌ను పట్టుకోవాలని కెమెరాలు ఆ పనిచేస్తాయని ఆయన అన్నాడు.

Virat Kohli is 'frustrated', says Mitchell Johnson

అదే చేశాయని, అటువంటి సంఘటనలు కొన్ని సార్లు చోటు చేసుకుంటాయని, ప్రతి ఆటగాడిని వెనక్కి పంపుతున్నాడని, అటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని అన్నాడు. గతంలో కోహ్లీతో జరిగిన మాటల యుద్ధాన్ని కూడా ఆయన గుర్తు చేశాడు.

ఆస్ట్రేలియా, ఇండియా హోరాహోరీ పోరాడుతున్న సమయంలో తాను ఇంటి వద్దనే ఉండి చూస్తూ పోయానని, రెండో టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ పేరే వినిపిస్తూ వచ్చిందని అన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లను వెనక్కి పంపుతూ ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపుతూ వచ్చాడని అన్నాడు.

2014లోని బాక్సింగ్ డే టెస్టు మ్యాచులో జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నాడు. తన పట్ల గౌరవం లేదని ఆట ముగిసిన తర్వాత కోహ్లీ అన్నట్లు తెలిపాడు. ఆట మలుపు తిరుగుతున్న సమయంలో తన బంతిని కోహ్లీ తన వైపు బ్లాక్ చేశాడని, తాను బంతిని స్టంప్‌లకు గురి పెట్టి విసిరానని, కోహ్లీ క్రీజు వెలుపల ఉండడం చూసి రన్నవుట్ చేద్దామని తాను అలా చేశానని, అయితే, విరాట్ వెనక్కి మళ్లాడని వివరించారు.

కోహ్లీ క్రీజులోకి చేరుకున్నాడని, అది అనుకోకుండా జరగడంతో తాను కోహ్లీకి క్షమాపణ చెప్పానని, అది కోహ్లీకి సరిపోలేదని, అప్పటి నుంచి అతను దూషించడం ప్రారంభించాడని, అప్పటి నుంచి అది ఆగిపోలేదని అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+