Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ నాలో ఉత్తేజాన్ని నింపాడు: డివిలియర్స్

Virat Kohli is a force of nature at crease: AB de Villiers

హైదరాబాద్: కోహ్లీకి డివిలియర్స్ అంటే ఎంత అభిమానమో చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇదే క్రమంలో డివిలియర్స్ కూడా కోహ్లీని తెగపొగిడేస్తున్నాడు. అంతేగాక, బెంగళూరు ప్లేఆఫ్‌ ఆశల సౌధాన్ని మోస్తున్న ఈ మేటి క్రికెటర్లు.. సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కోహ్లీ గురించి చెప్పమంటే ఏబీ డివిలియర్స్ మరోసారి తన ప్రేమని చాటుకున్నాడు.

'విరాట్ కోహ్లి, నేను ఒక తల్లికి పుట్టుకపోయినా.. మేమిద్దరం అన్మదమ్ములం' ఏడాది క్రితం కోహ్లీ గురించి చెప్పమంటే ఏబీ డివిలియర్స్ చెప్పిన మాట. మైదానంలో కోహ్లి, ఏబీ మధ్య సాన్నిహిత్యం చూస్తే ఈ మాట నిజమేనేమో అనిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ ఆడుతున్నఈ జోడి క్రీజులో ఉంటే.. ప్రత్యర్థి ఎవరైనా వెనక్కి తగ్గాల్సిందే అనేంతలా ఆధిపత్యం చెలాయిస్తారు.

'ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో గత శనివారం జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డాం. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నేను వేగంగా లయ అందుకోలేకపోయాను. అనారోగ్యం కారణంగా రెండు మ్యాచ్‌లకి దూరమవడం కూడా ఈ ఇబ్బందికి ఒక కారణం. కానీ.. ఆ దశలో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దూకుడుగా ఆడుతూ.. రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాది నాలో ఉత్తేజం నింపాడు. ఆఖర్లో అతను ఔటైనా.. అతను నింపిన ఉత్తేజంతోనే మ్యాచ్‌ని ఒక ఓవర్‌ ఉండగానే గెలుపుగా ముగించగలిగాను. ఇద్దరం కలిసి బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తాం' అని ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 181 పరుగులు చేయగా.. కోహ్లి (70), ఏబీ డివిలియర్స్ (72) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు గెలుపొందింది.

Story first published: Monday, May 14, 2018, 19:44 [IST]
Other articles published on May 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+