Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : ట్రెక్కింగ్‌లో కోహ్లీ ఫ్యామిలీ.. నెట్టింట ఫొటోలు వైరల్

Virat Kohli is enjoying time with his family

ప్రస్తుతం టీ20 క్రికెట్ నుంచి దూరంగా ఉంటున్న విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మతో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. భారత యువ జట్టు న్యూజిల్యాండ్‌తో తలపడుతున్న సమయంలో.. అతను రిషికేష్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ స్వామి దయానంద్ ఆశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ స్వామీజీ సమాధిని దర్శించుకున్న ఈ జంట.. ఆ తర్వాత రిషికేష్‌లోనే ట్రెక్కింగ్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలను వీళ్లిద్దరూ తమ తమ ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లో షేర్ చేసుకున్నారు.

ఈ బ్రేక్‌ను చక్కగా యూజ్ చేసుకుంటున్న కోహ్లీ దంపతులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారు. వీళ్లతోపాటు కోహ్లీ కుమార్తె వామిక కూడా తల్లీదండ్రులతోపాటు నేచర్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈ బ్రేక్ కచ్చితంగా కోహ్లీకి ఉపయోగపడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి వెళ్లిన కోహ్లీ అద్భుతమైన ఫామ్ అందుకున్నాడు. ఇప్పుడు అతను మరో ఆశ్రమాన్ని దర్శించుకోవడంతో టెస్టుల్లో కూడా అతను ఫామ్ అందుకుంటాడని వాళ్లు ఆశిస్తున్నారు.

Virat Kohli is enjoying time with his family

అంతకుముందు టీ20, వన్డే ఫార్మాట్లలో కోహ్లీ అద్భుతమైన ఫామ్ అందుకున్నప్పటికీ టెస్టు ఫార్మాట్లో అతని ఆటతీరు మెరుగవ్వలేదు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా జరిగిన రెండు టెస్టుల్లో కూడా కోహ్లీ పెద్దగా రాణించలేదు. అయితే పుజారా, గిల్, పంత్, శ్రేయాస్ అయ్యర్ తదితరులు మంచి ఫామ్‌లో ఉండటంతో భారత్ గట్టెక్కింది.

ఈ నేపథ్యంలో భారత్‌కు చాలా కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయినా కోహ్లీ తన ఫామ్ తిరిగి అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీనికి కోహ్లీ ఇప్పుడు తీసుకుంటున్న స్పిరిచ్యువల్ బ్రేక్స్ చక్కగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. మరి అతను టెస్టుల్లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నెగ్గితే భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది.

Story first published: Wednesday, February 1, 2023, 18:27 [IST]
Other articles published on Feb 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+