For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్యాబ్ ఫోర్‌లో నాలుగో ఇన్నింగ్స్ హీరో అతనే.. కోహ్లీ కింగే.. స్మిత్ దేనికీ పనికిరాడు!

టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు రాణించడం అంత ఈజీ కాదు. యాషెస్ తొలి టెస్టులో స్టీవ్ స్మిత్ అవుటవడం చూస్తే ఇదే విషయం అర్థం అవుతుంది. మరి ఫ్యాబ్ ఫోర్‌గా చెప్పుకునే స్మిత్, రూట్, కోహ్లీ, విలియమ్సన్ ఈ కఠినమైన నాలుగో ఇన్నింగ్స్ పరీక్షలో ఎన్ని మార్కులు సాధించారో చూద్దామా?

స్టీవ్ స్మిత్: ఫ్యాబ్ ఫోర్‌లో టెస్టుల్లో అత్యధిక సగటు ఉన్న ప్లేయర్ స్మిత్. ఇప్పటి వరకు 172 టెస్టులు ఆడిన అతను దాదాపు 60 సగటుతో బ్యాటింగ్ చేశాడు. అయితే నాలుగో ఇన్నింగ్స్ ఆటను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే స్మిత్ చాలా యావరేజ్ పెర్ఫామరే. ఎందుకంటే ఈ ఇన్నింగ్స్‌లో అతని సగటు కేవలం 30 మాత్రమే.

virat kohli steve smith

ఇప్పటి వరకు 23 సార్లు నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన అతను కేవలం 590 పరుగులే చేశాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్‌లో అతను ఒక్క సెంచరీ కూడా చేయలేదు. నాలుగు హాఫ్ సెంచరీలు చేయగా.. వీటిలో చివరది ఏడేళ్ల క్రితం శ్రీలంకపై చేసిందే.

జో రూట్: ఇంగ్లండ్ స్టార్ జో రూట్ ఈ ఫ్యాబ్ ఫోర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్. అతను స్మిత్ కన్నా రెట్టింపు సార్లు నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. మొత్తం 42 సార్లు ఫోర్త్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన అతను 43.09 సగటుతో 1465 పరుగులు చేశాడు. అంతేకాదు, ఈ ఇన్నింగ్స్‌లో ఏడు హాఫ్ సెంచరీలు, రెండు శతకాలు సాధించాడు.

ఈ సెంచరీలు రెండూ కూడా అతను ఆడిన చివరి ఐదు టెస్టుల్లోనే రావడం గమనార్హం. గతేడాది ఇండియాతో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 142 పరుగులతో అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టోతో కలిసి 378 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ ఛేజ్ చేసింది.

విరాట్ కోహ్లీ: కోహ్లీని 'ఛేజ్ మాస్టర్' అని ఊరికినే ఎవరూ అనరు. అతనికి కూడా నాలుగో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 27 సార్లు నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన అతను 58.38 సగటుతో 1038 పరుగులు చేశాడు. అతని యావరేజ్ మిగతా ఫ్యాబ్ ఫోర్ అందరి కన్నా ఎక్కువ కావడం గమనార్హం.

నాలుగో ఇన్నింగ్సులో కోహ్లీ రెండు శతకాలు, ఏడు హాఫ్ సెంచరీలు చేశాడు. అతను చేసిన సెంచరీల్లో ఒకటి కివీస్‌పై (105 నాటౌట్) కాగా, రెండోది ఆస్ట్రేలియాపై (141) కావడం గమనార్హం. ఫ్యాబ్ ఫోర్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో చేసిన సెంచరీలన్నీ స్వదేశాల్లో చేస్తే కోహ్లీ మాత్రం విదేశాల్లో చేయడం గమనార్హం.

కేన్ విలియమ్సన్: ఫ్యాబ్ ఫోర్‌లో నాలుగో ఇన్నింగ్స్‌ హీరో అంటే మాత్రం కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సనే. అతను 23 సార్లు నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 55.31 సగటుతో 885 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. తను మొదటి సారి నాలుగో ఇన్నింగ్స్ ఆడినప్పుడే కేన్ మామ సెంచరీ చేశాడు.

ఇక చివరగా తను ఆడిన టెస్టులో కూడా నాలుగో ఇన్నింగ్స్‌లో 121 పరుగులతో అజేయంగా నిలిచి కివీస్‌కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఈ మ్యాచ్‌లో 285 పరుగుల ఛేజ్‌లో చివరి రెండు వికెట్లు మిగిలి ఉండగా కేన్ ఆడిన విధానాన్ని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.

Story first published: Tuesday, June 20, 2023, 16:12 [IST]
Other articles published on Jun 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+