మొహాలి: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడని, అతడిని వేరే బ్యాట్సమన్లతో పోల్చి చూడటం అసంబద్దమని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. ఆదివారం మొహాలిలో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరుతో సెంచరీ (154 నాటౌట్) సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోని సేన 48.2 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 289 పరుగులు చేసింది. దీంతో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. లక్ష్య చేధనలో భాగంగా ధోనీ, కోహ్లీలు 151 పరుగుల చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ క్రమంలో ధోనీ 80 పరుగుల వద్ద ఔటవ్వగా, కోహ్లీ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందజంలో ఉంది. నాలుగో వన్డే ఈనెల 26న రాంచీలో జరగనుంది. మ్యాచ్ అనంతరం ధోని మీడియాతో మాట్లాడాడు.
9000: ధోని ఖాతాలో మరో రికార్డు, 5వ ఆటగాడిగా గుర్తింపు
'క్రికెట్‌లో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే ఒకరితో మరొకరిని పోల్చి చూడటం. గత కొంత కాలంగా క్రికెట్ ఆడుతున్న తీరుతో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది. సునీల్ గవాస్కర్‌తో వీరేంద్ర సెహ్వాగ్‌ను పోల్చలేం. ఇద్దరు కూడా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లే. అయితే అప్పటికి ఇప్పటికే క్రికెట్ చాలా మారింది' అని ధోని పేర్కొన్నాడు.
'టెస్టు మ్యాచ్‌లతో పోలిస్తే, పరిమిత ఓవర్ల ఫార్మెట్ పూర్తిగా మారింది. ఇద్దరు ఆటగాళ్లను పోల్చడం అసంబద్ధం. కోహ్లీ గురించి తాను వ్యాఖ్యానించదలచుకోలేదు. క్రికెట్‌లో అతను ఎంతో వృద్ధి చెందాడు. అయితే అతడు క్రికెట్ ఆడుతున్న తీరు మాత్రం అద్భుతం.' అని కొనియాడాడు.

'క్రికెట్ ఇప్పుడు చాలా మారిపోయింది, దీన్ని పోల్చడం కష్టం. బ్యాట్సమన్లను ఒకరితో ఒకరిని పోల్చడం అసంబద్దంగా ఉంటుంది. గొప్ప ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు. అతడు ఆడుతున్నప్పుడు చూడడం నాకెంతో ఇష్టం' అని ధోని పేర్కొన్నాడు. కాగా మూడో వన్డేలో ధోని నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తన సత్తా చాటేందుకే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చినట్టు తెలిపాడు. 'నేనేంటో చెప్పడానికే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాను. సత్తా చాటాను. నాలుగు స్థానంలో బ్యాటింగ్ దిగితే తప్పనిసరిగా పెద్ద షాట్లు ఆడాలి. నేనేంటో నిరూపించుకోవడానికి ఈ స్థానమే సరైంది. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌కు దిగడం వల్ల ఎక్కువసేపు ఆడడటానికి అవకాశం ఉండట్లేదు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చాను. ఎక్కువసేపు క్రీజ్‌లో ఉంటే బాగా ఆడతాననే నమ్మకం ఉంది' అని ధోని తెలిపాడు.
ఎవరికి అందనంత ఎత్తులో: ధోని ఖాతాలో మరో వరల్డ్ రికార్డు
మూడో వన్డేలో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగి అర్థసెంచరీ(80)తో రాణించాడు. ఏడాది తర్వాత ధోని ఈ అర్ధ సెంచరీ చేయడం విశేషం. అంతేకాదు ఈ మ్యాచ్‌లో ధోని, కోహ్లీ ఇద్దరూ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పి భారత విజయానికి తోడ్పాటు అందించారు. కాగా, ధోనికి తోడు కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్ ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ధోని ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ధోని 9 వేల పరుగులను పూర్తి చేసుకోవడం పాటు అంతకుముందు వన్డేల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 195 సిక్స్‌ల రికార్డును కూడా ధోనీ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో ధోని మూడు సిక్స్‌లతో 196 సిక్స్‌లు బాది భారత్ తరుపున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా కూడా ధోని అవతరించాడు.