కోహ్లీ మాకు ఓపెనర్ ఆప్షనే.. అందుకే సిరాజ్‌ను కాదని ఉమేష్‌ని తీసుకున్నాం..! ప్రెస్ మీట్‌లో రోహిత్ శర్మ

రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సన్నద్ధమవుతుంది. సెప్టెంబర్ 20న మొహాలీలో తొలి మ్యాచ్ జరగబోతుంది. ఆసియాకప్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకోవడంలో టీమిండియా విఫలమైన సంగతి తెలిసిందే. ఆసియాకప్ జట్టులో కొన్ని ప్రయోగాలు జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటి ప్రయోగాలే చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక బౌలింగ్ విభాగంలో కాస్త లోటు కన్పించగా.. ఆసీస్ సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల నుంచి కోలుకుని జట్టులోకి రావడంతో పేస్ విభాగం పటిష్ఠంగా కన్పిస్తుంది. ఇది టీమిండియాకు బెనిఫిట్ కానుంది.
ప్రయోగం చేస్తే ప్రాబ్లమ్ అనుకోకండి
ఇక ఈ సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రసంగించాడు. విరాట్ కోహ్లీని టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున ఓపెనర్‌గా చూడవచ్చా అనే విషయమై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు తరఫున మనకు అవసరమైన ఎంపికలు అందుబాటులో ఉండటం ఎప్పుడూ మంచిదే. టీ20 ప్రపంచకప్‌కు మంచి జట్టు కూర్పుతో వెళ్లడం చాలా ముఖ్యం. జట్టులో ప్లేయర్లు ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండాలి. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలిగే ప్లేయర్లు ఉండాలి. జట్టు పరంగా మేము ఏదైనా కొత్త ప్రయత్నం చేసినప్పుడు అదో సమస్యల మాత్రం చూడొద్దు. అది మంచి ప్రయోగంలా చూడాలి.' అని రోహిత్ విలేకరుల సమావేశంలో తెలిపాడు.

కచ్చితంగా విరాట్ ఓపెనర్ ఆప్షనే..
విరాట్ ఓపెనింగ్ గురించి రోహిత్ మాట్లాడుతూ.. 'విరాట్ కోహ్లీ మా మూడో ఓపెనింగ్ ఆప్షన్. అతను కొన్ని మ్యాచ్‌లలో ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. ఆసియా కప్ చివరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతను ఆడిన తీరుతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. వరల్డ్ కప్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. అతని ప్రదర్శన గురించి పెద్దగా నోటీస్ కాలేదు. కానీ అతను మంచి ఓపెనర్. మాకు ముఖ్యమైన ఆటగాడు. మేం మా ఆలోచనా విధానంలో చాలా స్పష్టంగా ఉన్నాం. జట్టు పరంగా ఎలాంటి గందరగోళం లేదు. కేఎల్ రాహుల్ జట్టు కోసం ఎలాంటి రోల్ కనబర్చుతాడో అనే విషయమై కూడా మాకో స్పష్టత ఉంది.' చెప్పాడు.

ఒక్కొక్కరు ఒక్కో కారణంతో..
మహ్మద్ షమీకి కరోనా పాజిటివ్ తేలడంతో అతని స్థానంలో ఉమేష్ యాదవ్‌ను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కూడా విలేకరులు రోహిత్‌కు ప్రశ్నలు గుప్పించారు. 'కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వారిలో ప్రసిద్ధ్ గాయపడ్డాడు. సిరాజ్ కౌంటీల్లో ఆడుతున్నాడు. అతను ఒకట్రెండు మ్యాచ్‌ల కోసం తాను రాణిస్తున్న కౌంటీలను వదిలి ఇంత దూరం రావడం మాకు ఇష్టం లేదు. సహజంగానే.. షమీ దురదృష్టకర రీతిలో జట్టుకు దూరమయ్యాడు. ఆసియా కప్‌లో అవేష్ చాలా అనారోగ్యంగా కన్పించాడు. అతను కోలుకోవడానికి కొంత సమయం కావాలి. ఫిట్‌నెస్ పరంగాను అతనికి కొంత టైం కావాలి. అతని ఫిట్‌నెస్‌ను తిరిగి పొందాలి. అన్నీ విషయాలు పరిగణించే ఉమేష్‌ను తీసుకున్నాం.' అని రోహిత్ అన్నాడు.

ఉమేష్ గురించి వంక పెట్టాల్సిన పనిలేదు
'షమీ, ఉమేష్ ఏ ఫార్మాట్‌లో ఆడినా తామేంటో వాళ్లు నిరూపించుకున్నారు. వారి బౌలింగ్ క్వాలిటీని మేము అర్థం చేసుకున్నాం. ఉమేష్, షమీ ఫిట్‌గా ఉంటే వాళ్ల గురించి వంకలు పెట్టాల్సిన పనిలేదు. ఐపీఎల్‌లో ఉమేష్ ఎలా బౌలింగ్ చేశాడో మనం చూశాం. స్వింగ్‌తో పాటు వేగంగా బౌలింగ్ చేయగలడు. ఉమేష్ ఎంపిక కోసం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఇది చాలా సింపుల్ విషయం. అసలు ఇది చర్చనీయాంశమైన విషయం కూడా కాదు. ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని.. మేము చాలా మంది ఆటగాళ్లను ప్రయోగించాం. మేము మా విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. మా ఆలోచన ప్రక్రియతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాం' అని రోహిత్ చెప్పాడు.

ఆస్ట్రేలియా సిరీస్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ , హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications