For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైరల్ వీడియో.. డైనోసార్‌లా మారిన విరాట్ కోహ్లీ!!

Virat Kohli Is A Dinosaur On The Loose In Anushka Sharmas Hilarious Video

ముంబై: ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌తో క్రికెటర్లంతా ఇళ్లల్లోనే లాక్‌ అయిపోయారు. ఈ క్రమంలోనే తమ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించ‌ని విరామాన్ని బాలీవుడ్ నటి, సతీమణి అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతున్నాడు. అయితే సోషల్‌మీడియా ద్వారా విరాట్, అనుష్కలు తమకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు.

డైనోసార్‌లా మారిన కోహ్లీ

ప్రమాదకర కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్‌డౌన్‌లో పాటించాల్సిన నిబంధనల గురించి ప్రజల్లో అప్రమత్తం కలిగేలా విరుష్క జోడి వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. తాజాగా మాత్రం అభిమానును ఖుషీ చేసే వీడియో ఒకటి అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. వీడియోలో విరాట్ కోహ్లీ డైనోసార్‌లా నడిసాడు. ఒక రూంలో నుండి మరో రూంలోకి నడుచుకుంటూ వచ్చాడు. చివరకు అచ్చం డైనోసార్‌లా అరిచాడు.

చాలా కళలు ఉన్నాయే

చాలా కళలు ఉన్నాయే

డైనోసార్‌లా నడిచిన విరాట్ కోహ్లీ వీడియోను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 'నేను ఒక డైనోసార్‌ని కనుగొన్నాను' అంటూ అనుష్క ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. కోహ్లీ అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'కోహ్లీ భయ్యా.. అచ్చం డైనోసార్‌లా నడిచావ్' అని ఓ అబిమాని కామెంట్ చేయగా.. 'కోహ్లీ దగ్గర చాలా కళలు ఉన్నాయే' అని మరో అభిమాని కెమెంట్ చేసాడు. విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. 2017, డిసెంబర్ 11 విరాట్-అనుష్క ఇటలీలో వివాహం చేసుకున్నారు.

అనుష్క అయితేనే చేస్తా

అనుష్క అయితేనే చేస్తా

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో సమయం గడుపుతున్నాడు. ఆదివారం భారత ఫుట్‌బాల్‌ ఆటగాడు సునీల్‌ ఛెత్రీతో జరిగిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సంభాషణలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అనేక విషయాలను షేర్‌ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ తనపై బయోపిక్ చేయడంలో ఎలాంటి సమస్యలు లేవన్నాడు. అయితే తన బ‌యోపిక్‌లో లీడ్ రోల్ పోషించడానికి మాత్రం ఒక షరతు పెట్టాడు. త‌నపై రూపొందించే బ‌యోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్‌, సతీమణి అనుష్క శ‌ర్మ హీరోయిన్ అయితేనే న‌టించేందుకు సిద్ధ‌మ‌ని కోహ్లీ అన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 21,901 పరుగులు

అంతర్జాతీయ క్రికెట్‌లో 21,901 పరుగులు

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, May 20, 2020, 17:56 [IST]
Other articles published on May 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+