For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

By Nageshwara Rao
Virat Kohli in IPL - 150 IPL appearances and 4500 runs

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 150 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదకగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

150 మ్యాచ్‌లు ఆడిన ఐదో ఆటగాడు

150 మ్యాచ్‌లు ఆడిన ఐదో ఆటగాడు

ఈ మ్యాచ్‌ విరాట్ కోహ్లీకి 150వ మ్యాచ్ కావడం విశేషం. ఈ లీగ్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన ఐదో ఆటగాడు విరాట్ కోహ్లీ. కోహ్లీకి ముందు సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌‌లు ఈ ఘనత సాధించాడు. తద్వారా ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నిలిచాడు.

 ప్రారంభ సీజన్ నుంచి బెంగళూరు తరుపునే

ప్రారంభ సీజన్ నుంచి బెంగళూరు తరుపునే

2008లో ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభమైంది. ప్రారంభ సీజన్ నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపునే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2013లో డానియల్‌ వెటోరీ నుంచి కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అద్భుతమైన విజయాలను సాధించినప్పటికీ, ఐపీఎల్‌లో మాత్రం బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్‌ ట్రోఫీ గెలవలేక పోవడం విశషం.

మూడు సార్లు ఫైనల్స్‌కు వెళ్లినా రన్నరప్‌గానే

మూడు సార్లు ఫైనల్స్‌కు వెళ్లినా రన్నరప్‌గానే

మూడు సార్లు ఫైనల్స్‌కు వెళ్లినప్పటికీ, రన్నరప్‌గానే మిగిలింది. ఐపీఎల్ 11వ సీజన్‌లో కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

తొలి మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి

తొలి మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి

అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా విజయంలో ఓపెనర్ సునీల్ నరైన్ (19 బంతుల్లో 50, 4ఫోర్లు, 5సిక్స్‌లు) కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 31 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 150 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడిన కోహ్లీ 4,449 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో కోహ్లీ వ్యక్తిగత అత్యధిక స్కోరు 113.

Story first published: Monday, April 9, 2018, 15:26 [IST]
Other articles published on Apr 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+