Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : పిలిచి మరీ సెల్ఫీ ఇచ్చిన కోహ్లీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

టీమిండియా స్టార్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వంటి మోడ్రన్ గ్రేట్‌కు ఎంతటి ఫాలోయింగ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. అలాంటి కోహ్లీ ఎక్కడ కనబడినా ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు అంటూ ఫ్యాన్స్ ఎగబడతారు. అయినా చికాకు పడకుండా తన ఫ్యాన్స్‌ను సంతోష పెట్టడం కోహ్లీకి అలవాటు.

ఇలా కోహ్లీ తన ఫ్యాన్స్‌ను సంతోష పెట్టిన ఘటనలు కోకొల్లలు. తాజాగా కూడా అలాంటి ఘటనే వెలుగు చూసింది. విండీస్‌లో టెస్టులు ఆడిన తర్వాత విరాట్ కోహ్లీకి మళ్లీ ఆ గడ్డపై బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తొలి వన్డేలో అతను బ్యాటింగ్‌కు రాలేదు. ఇక మిగతా రెండు వన్డేల్లో అతనికి విశ్రాంతి ఇచ్చారు. టీ20ల్లో అతన్ని సెలెక్ట్ చేయలేదు.

Virat Kohli Fan

ఈ క్రమంలో తిరిగి ముంబై వచ్చేసిన కోహ్లీ.. మినీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నెలాఖరులో జరిగే ఆసియా కప్‌లో టీమిండియా విజయానికి కోహ్లీ చాలా కీలకం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఇలా తన వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కోహ్లీని ఒక చోట ఫ్యాన్స్ చుట్టుముట్టారు.

అతనితో ఫొటో దిగేందుకు ఒక ఫ్యాన్ ప్రయత్నించాడు. కోహ్లీకి దగ్గరగా వెళ్లడం కుదరకపోవడంతో కొంచెం దూరం నుంచే సెల్ఫీ తీసుకోబోయాడు. ఇది చూసిన కోహ్లీ అతన్ని తన దగ్గరకు పిలిచాడు. అతనితో కలిసి సెల్ఫీ దిగి పంపించాడు. కోహ్లీ చేసిన పని ఆ ఫ్యాన్‌కు ఎంత సంతోషం కలిగించిందో అతని మొఖం చూస్తేనే తెలుస్తుంది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోహ్లీ ఇలా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకుముందు కూడా కోహ్లీ చాలా సార్లు ఇలా ఫ్యాన్స్‌ విషయంలో పెద్ద మనసు చాటుకున్న వీడియోలు కూడా మళ్లీ ట్రెండిగ్ అవుతున్నాయి.

Story first published: Friday, August 18, 2023, 7:44 [IST]
Other articles published on Aug 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+