12th Man: కోహ్లీ చేతుల మీదుగా చిన్నారికి జెర్సీ
హైదరాబాద్: ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టులో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లాండ్‌తో గత మూడు సిరిస్‌లలో భారత ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
2012-13 టెస్టు సిరిస్‌లో ఇదే ముంబైలో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. దానికి ప్రతీకారంగా నాలుగో టెస్టులో విజయంతో దెబ్బకు దెబ్బ తీసింది. అంతేనా ఐదు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరిస్‌ను భారత్ కైవసం చేసుకుంది.
టెస్టుల్లో భారత్‌కు ఇది 135వ గెలుపు కావడం విశేషం. ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది 24వ టెస్టు విజయం. ముంబై టెస్టు విజయంతో ఇంగ్లాండ్‌పై టీమిండియా 0-3 ఆధిక్యంలో నిలిచింది. ముంబై టెస్టులో భారత్ ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో చివరి టెస్టు డిసెంబర్ 16 నుంచి చెన్నైలో జరగనుంది.
ఇదిలా ఉంటే వాంఖడే మైదానంలో నాలుగో టెస్టు ముగిసిన అనంతరం అభిమానుల కోసం నిర్వాహకులు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాలుగో టెస్టు రెండో రోజు నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చినవారి నుంచి చిన్నారులను ఎంపిక చేసి టీమిండియా జట్టులో 12వ సభ్యుడిగా పేర్కొంటూ వారికి టీమిండియా జెర్సీని అందించారు.
చిన్నారికి కోహ్లీ చేతుల మీదుగా జెర్సీ
నాలుగో టెస్టు ఐదో రోజు ఆట ముగిసిన అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా ఎనిమిదేళ్ల అనయ జైన్ టీమిండియా జెర్సీని అందుకుంది. ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన టీమిండియా జట్టులో 12వ ఆటగాడిగా అనయను ఎంపిక చేసి జెర్సీని బహుకరించారు.
పార్థివ్ పటేల్ చేతుల మీదుగా
ఈ క్రమంలో నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత భారత ఆటగాడు పార్థివ్ పటేల్ చేతులమీదుగా ఎనిమిది సంవత్సరాల కవలలు వివాన్, విశ్మే టీమిండియా జెర్సీలను అందుకున్నారు.
ఓపెనర్ మురళీ విజయ్ చేతుల మీదుగా
మూడో రోజు ఆట ఆట అనంతరం శతకం నమోదు చేసిన విజయ్ చేతులమీదుగా ఐదేళ్ల చిన్నారి ధృవ టీమిండియా జెర్సీని అందుకుంది.
జయంత్ యాదవ్ చేతుల మీదుగా
నాలుగో రోజు ఆట అనంతరం జయంత్ యాదవ్ చేతుల మీదుగా తొమ్మిదేళ్ల అనయ భన్సాల్ టీమిండియా జెర్సీలను అందుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications