
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మిథాలీ మాట్లాడుతూ ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ తనకు స్పూర్తిని కలిగిస్తున్నాడని వెల్లడించింది.
తన కెరీర్ తొలినాళ్లలో మహిళల క్రికెట్‌కు అంతగా ఆదరణ లేదని, కానీ ఇప్పడు మహిళా క్రికెటర్లను గుర్తించి గౌరవించడం చాలా సంతోషంగా ఉందని మిథాలీ తెలిపింది. క్రికెట్ శకం మొదలైన సమయంలోనే అరంగేట్రం చేసినప్పటికి తనకు అంతగా గుర్తింపు దక్కలేదని మిథాలీ వాపోయింది.

తనపై చేసే విమర్శలపై స్పందిస్తూ కాలాన్ని వృథా చేసుకోనని తేల్చి చెప్పింది. 'ప్రతి రోజు ఎంతో మంది నాకు స్తూర్తిని కలిగిస్తారు. వారిలో ఒకరి గురించి చెప్పాలంటే అది విరాట్ కోహ్లీయేనని, తన ఫిట్‌గా ఉంటూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేలా ఆసక్తి కలిగించాడు' అని మిథాలీ చెప్పుకొచ్చింది.
క్రికెట్‌లో పురుషులకైనా, మహిళలకైనా ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని ఈ సందర్భంగా మిథాలీ తెలిపింది. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరి ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ యావత్ భారతావని మన్ననలను అందుకున్న సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.