4482 ప్రమిదలతో కోహ్లీ చిత్రం: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్ వర్క్


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ముంబైకి చెందిన ఓ అభిమాని వినూత్న రీతిలో ట్రిబ్యూట్ అర్పించాడు. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన అబ్బాసాహేబ్ షేవాలే అనే కళాకారుడు ప్రమిదలతో కోహ్లీ రూపాన్ని తయారు చేశాడు.
కోహ్లీ పుట్టినరోజుతో పాటు దీపావళి పండుగ
ఈ రూపంలో విరాట్ కోహ్లీ పుట్టినరోజుతో పాటు దీపావళి పండుగ ఉద్దేశం ప్రతిబింభించేలా రూపొందించాడు. ఈ రూపాన్ని నవీ ముంబైలోని సీవుడ్స్ గ్రాండ్ సెంట్రల్‌లో అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచారు. 9.5 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు ఉన్న ఈ రూపం ఇప్పుడు అందరిని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రమిదలతో ఈ రూపాన్ని తయారు చేసినట్లు
విరాట్ కోహ్లీ రికార్డులకు ప్రశంసగా అతడు ప్రమిదలతో ఈ రూపాన్ని తయారు చేసినట్లు తెలిపాడు. ఇందుకోసం మొత్తం 4482 ప్రమిదలను ఉపయోగించారు. ఈ ఆర్ట్ వర్క్‌ను రూపొందించేందుకు గాను మొత్తం ఎనిమిది గంటల సమయం పట్టింది. ప్రపంచంలోనే ప్రమిదలతో తయారు చేసిన అతి పెద్ద కళాఖండం ఇది.
అబ్బాసాహేబ్ షేవాలే మాట్లాడుతూ "
ఈ ఆర్ట్ వర్క్‌ని రూపొందించిన అబ్బాసాహేబ్ షేవాలే మాట్లాడుతూ "విరాట్ కోహ్లీ కాంతివంతమైన దీపంలా వెలిగిపోతున్నాడు. దీపావళి సమీపిస్తోన్న తరుణంలో ఆయనకు ప్రశంసలు తెలపడానికి ఇది సరైంది. అంతేకాకుండా నవంబరు 5న కోహ్లీ పుట్టినరోజు" అని వెల్లడించారు.

ఫేస్‌బుక్ పేజిలో అభిమానులతో పంచుకున్న అబ్బాసాహేబ్
ఈ ఆర్ట్ వర్క్‌కు సంబంధించిన వీడియోని అబ్బాసాహేబ్ షేవాలే తన ఫేస్‌బుక్ పేజిలో అభిమానులతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా, గురువారంతో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌ను కోహ్లీ సేన 3-1తేడాతో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications