
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏది చేసినా కొత్తగానే ఉంటుంది. స్టైల్‌ను అనుకరించడంలో, ట్రెండ్ సెట్ చేయడంతో విరాట్ కోహ్లీది ప్రత్యేకమైన శైలి. టాటూలు అంటే కోహ్లీకి ఎనలేని ఇష్టం. వినూత్న హెయిర్ స్టైల్‌తో, సిరకొత్త టాటూలతో అభిమానులకు దర్శనమిస్తుంటాడు.
విరాట్ కోహ్లీ ఎడమ చేతిని గమనిస్తే మణికట్టు నుంచి భుజం వరకు రకరకాల ఆకృతులు కనిపిస్తుంటాయి. ఇందులో 'గాడ్స్ ఐ (దేవుని కన్ను)' టాటూ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పటికే భుజంపై ఉన్న 'గాడ్స్ ఐ' ఆకారానికి చుట్టూ మరో కొత్త టాటూను వేయించుకున్నాడు.
శనివారం బాంద్రాలోని ఏలియన్స్ టాటూలో బాడీ ఆర్టిస్ట్ ఆలన్ గోయిస్‌తో కోహ్లీ టాటూ వేయించుకున్నాడు. ఈ ఫొటోలను గోయిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. కోహ్లీ కొత్త టాటూలను చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో వీటిపై పెద్ద ఎత్తున కామెంట్లు పోస్టు చేస్తున్నారు.