For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జట్టు కోసం ఆడతా.. నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు'

Virat Kohli: India captain does not feel need to prove himself against England

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్‌కు సంబంధించిన ట్రోఫీని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం ఆరంభంకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇరు జట్ల కెప్టెన్లు మాట్లాడారు.

ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. తానెంటో ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు. 'జట్టు కోసం నేను పరుగులు చేయాలనుకుంటున్నాను. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నదే నా ముందున్న లక్షం. అదే నా అసలైన ఉద్దేశం. ఏ దేశంలోనూ నేనేంటో ప్రత్యేకంగా నిరూపించుకోవాలనే ఆలోచన అయితే లేదు. జట్టు కోసం అద్భుతంగా రాణించాలనుకుంటున్నా. జట్టులో సమతూకం ఉండాల్సిన అవసరం ఉంది.

1
42374

దానిపై కసరత్తు చేస్తున్నాం. పరిస్థితులను అర్థం చేసుకోవడం కోసం ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలాసేపే క్రికెట్ ఆడాం. జట్టును గెలిపించాలనే భావన, అందరిలోనూ నిజాయతీ ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ఒక జట్టుగా మేమంతా ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉన్నాం' అని విరాట్ వెల్లడించాడు.

భారత జట్టులో మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌ల మధ్య ఓపెనింగ్ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఎవరికి చోటు కల్పించాలనే దానిపై కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌ తర్జన భర్జనలు పడుతోంది. వార్మప్ మ్యాచ్‌లో రాణించిన మురళీ విజయ్‌ బరిలో దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

జట్ల వివరాలు(అంచనా) :

ఇండియా:
Virat Kohli (c), Shikhar Dhawan, Murali Vijay, KL Rahul, Cheteshwar Pujara, Ajinkya Rahane, Dinesh Karthik (wk), Rishabh Pant, Karun Nair, Hardik Pandya, R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Ishant Sharma, Umesh Yadav, Shardul Thakur, Mohammed Shami, Jasprit Bumrah.

ఇంగ్లాండ్:
Joe Root (c), Alastair Cook, Keaton Jennings, Jonny Bairstow, Jos Buttler, Ben Stokes, Dawid Malan, Moeen Ali, Adil Rashid, Jamie Porter, Sam Curran, James Anderson, Stuart Broad.

Story first published: Wednesday, August 1, 2018, 10:22 [IST]
Other articles published on Aug 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+