For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైరల్ ఫొటో.. సరికొత్తగా విరాట్ కోహ్లీ!!

Virat Kohli Impresses Mayank Agarwal With His Retro Look

ముంబై: భారత క్రికెటర్లు ఒక్కో సిరీస్‌‌కు ఒక్కొక్కరు కొత్తగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా హెయిర్ స్టయిల్ విషయంలో. హెయిర్ స్టయిల్ మార్చుకోవడం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బాగా అలవాటు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందువరసలో ఉంటాడు. కెప్టెన్‌గానే కాదు.. ఆటతోనూ, స్టైలిష్ లుక్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంటాడు. అతని ఒంటి మీద టాటూలు అందులో భాగమే. ఇక హెయిర్‌స్టైల్‌, గడ్డం విషయంలోనూ కొహ్లీ ప్రత్యేకత చూపిస్తాడు. ఎప్పటికప్పడు అప్‌డేటెడ్‌గా ఉండే కోహ్లీ.. తాజాగా సరికొత్తగా కనిపించాడు.

టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో విరాట్ కోహ్లీ మాట్లాడుతున్న వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అందులో కోహ్లీ మరో సరికొత్త రూపంలో కనిపించాడు. కాస్త పొడవాటి జట్టుతో.. గుబురుగా పెరిగిన గడ్డంతో ఉన్నాడు. పెద్ద కళ్లద్దాలు పెట్టుకున్న విరాట్.. వెనుకటి రోజులను గుర్తుకుతెచ్చాడు. జట్టు, గడ్డంతో ఉన్న కోహ్లీ కొత్త అవతారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కొత్త లుక్‌ బాగుందంటూ అభిమానులు కెమెంట్లు చేస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అతని భార్య అనుష్క శర్మతో ఆనందంగా గడుపుతున్నాడు. ఇంటికే పరిమితమైన వీరిద్దరూ తమ ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ ‌మీడియాలో పంచుకుంటున్నారు. ఇద్దరు కలిసి వంట చేస్తున్న వీడియోలు, సరదాగా గడిపే ఫొటోలను సోషల్‌ మీడియాలో ఇప్పటికే పోస్టు చేశారు. ఇక యూఏఈలో ఐపీఎల్ 2020 జరగనున్న నేపథ్యంలో.. విరాట్ త్వరలో మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఐపీఎల్ కంటే ముందే.. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశం ఉంది.

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

Story first published: Thursday, July 23, 2020, 15:02 [IST]
Other articles published on Jul 23, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+